ప్రమాదంలో పసికందులు

నిలోఫర్ ఫక్కిలో సంఘటన మాయలేడి చేతిలో మహా మోసం సర్కార్ అసుపత్రుల్లో భద్రత డొల్ల పని చేయని సిసి కెమెరాలు మన తెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో : గత కొద్ది రోజుల నుండి ఉమ్మడి జిల్లాలో పసికందుల అపహరణ వ్యవహరాలు అంతట భయందోళన సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఈ అపహరణ పుకార్లను కొట్టిపరేస్తు ఎలాంటి సంఘటలు జరగలేదని తల్లిదండ్రులు భయభ్రంతులకు గురి కావద్దంటు ప్రచారం చేస్తున్నారు. ఇటివల హైదరాబాద్‌లోని నిలోఫర్ పిల్లల ఆసుపత్రి నుండి ఓ మహిళ పసి […]

నిలోఫర్ ఫక్కిలో సంఘటన
మాయలేడి చేతిలో మహా మోసం
సర్కార్ అసుపత్రుల్లో భద్రత డొల్ల
పని చేయని సిసి కెమెరాలు

మన తెలంగాణ/ఆదిలాబాద్‌బ్యూరో : గత కొద్ది రోజుల నుండి ఉమ్మడి జిల్లాలో పసికందుల అపహరణ వ్యవహరాలు అంతట భయందోళన సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఈ అపహరణ పుకార్లను కొట్టిపరేస్తు ఎలాంటి సంఘటలు జరగలేదని తల్లిదండ్రులు భయభ్రంతులకు గురి కావద్దంటు ప్రచారం చేస్తున్నారు. ఇటివల హైదరాబాద్‌లోని నిలోఫర్ పిల్లల ఆసుపత్రి నుండి ఓ మహిళ పసి కందును ఎత్తుకెళ్లి కర్ణాకలోని బిదర్‌లో పట్టుబడ్డ ఉదంతం మరువక ముందే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకోవడం ప్రధాన్యతను సంతరించుకుంటోంది. ఈ నేపద్యంలోనే మంగళవారం వెకువ జామున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన పసికందు ఉదంతం సర్వత్రా కలకలం రేపుతోంది. ఓ బాలింత ఓడి నుండి ఆరు రోజుల పసి కందును అపరిచిత మహిళ దర్జాగా అపహరించుకుపోయిన ఉదంతం ఆ ఆసుపత్రిలోని భద్రత వైఫల్యాన్ని వెల్లడిస్తుంది. నార్నూర్ మండలం చోర్‌గాంకు చెందిన మమత అనే ఓ మహిళ ప్రసవం కోసం రిమ్స్ అసుపత్రిలో చేరింది. ఈనెల 4న ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది.అయితే వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమత మంగళవారం డిశ్చార్జీ కావాల్సి ఉంది. ఇంతాలోనే ఇదే రోజు వెకువ జామున 3, 4 గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పుష్పలత అనే మహిళ రిమ్స్‌లోకి చొరబడి మమత ఒడి నుండి పసికందును అపహరించుకువెళ్లింది. అప్పటికే తెరుకున్న బాదితురాలు మమత అక్కడి సిబ్బంది, వైద్యులకు తెలపడంతో వారు పోలీసుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు శిశువును అపహరించుకువెళ్తున్న పుష్పలతను రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. అయితే భద్రత పరంగా అత్యంత పష్టింగా ఉండాల్సిన రిమ్స్ ఆసుపత్రి నుండి ఓ పసి కందును నిర్భయంగా ఎత్తుకెళ్లడం అక్కడి భద్రత వైఫల్యానికి కారణంగా చెబుతున్నారు. ప్రతి ఏటా లక్ష రూపాయల ఖర్చు చేసి ఆసుపత్రిలో భద్రత చర్యలు చేపడుతున్నారు. భద్రత సిబ్బంది నియామకంతో పాటు రిమ్స్ ప్రధాన ద్వారం నుండి లోపల ఉన్న ప్రతి గదికి కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిర్వహణకు లక్షల రూపాయలు వ్యయం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి సీసీ కెమెరాలు పని చేయడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. భద్రత సిబ్బంది కూడా సక్రమంగా పని చేయడం లేదంటున్నారు. అయితే ఈ లోపాలను తెలుసుకున్న మహిళ దర్జాగా రిమ్స్‌లోకి చోరబడి అపహరణకు పాల్పడ్డట్టు పేర్కొంటున్నారు. రిమ్స్‌లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, మెటర్నటి అసుపత్రుల్లో కూడా భద్రత లోపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా డెలవరి వార్డులు, పసి పిల్లల వార్డుల వద్ద కనీస స్థాయిలో కూడా భద్రత చర్యలు చేపట్టడం లేదంటున్నారు. అన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినస్పటికి వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఇలాంటి సంఘటనలకు అస్కారం ఏర్పాడుతుందన్నారు. ఇప్పటికైన ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం అపరిచితుల రాకపోకలను గమనించే రీతిలో చర్యలు చేపట్టాలని అలాగే తగినంత భద్రత సిబ్బందిని నియామించాలని సూచిస్తున్నారు. దీనికి తోడుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని నిర్వహించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియామించాలని కోరుతున్నారు.

Related Stories: