ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకుంటే కఠిన చర్యలు

మన తెలంగాణ/గద్వాల న్యూటౌన్ : రైతుబంధు పథకంలో ఇప్పటి వరకు రైతులకు అంద ని పాసు బుక్కులు, చెక్కుల విషయంలో రెవెన్యూ గ్రామానికి వెళ్లి అక్కడే పరిష్కరించి అవసరమనుకుంటే తగు ఉత్వర్తులు జారీ చేసి రైతులకు అందజేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ రోనాల్డ్ రోస్ అధికారులను అదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో తహసీల్దార్లు విఆర్‌ఒలు, ఎఇఒతో రైతుబంధు పథకముపై సమీక్ష సమావేశము నిర్వహించారు. మే 20వ తేది తర్వాత ఇప్పటి వరకు పాసు బుక్కులు […]


మన తెలంగాణ/గద్వాల న్యూటౌన్ : రైతుబంధు పథకంలో ఇప్పటి వరకు రైతులకు అంద ని పాసు బుక్కులు, చెక్కుల విషయంలో రెవెన్యూ గ్రామానికి వెళ్లి అక్కడే పరిష్కరించి అవసరమనుకుంటే తగు ఉత్వర్తులు జారీ చేసి రైతులకు అందజేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ రోనాల్డ్ రోస్ అధికారులను అదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో తహసీల్దార్లు విఆర్‌ఒలు, ఎఇఒతో రైతుబంధు పథకముపై సమీక్ష సమావేశము నిర్వహించారు. మే 20వ తేది తర్వాత ఇప్పటి వరకు పాసు బుక్కులు చెక్కలు తీసుకొని రైతుల విషయములో ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నారని ఒక్కో గ్రామాల వారిగా వచ్చిన మొత్తం పాసు బుక్కులు ఎన్ని చెక్కులు ఎన్ని అందులో ఇప్పటి వరకు పంచినవి ఎన్ని అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వాము ఇస్తున్న మార్గదర్శకాలను సక్రమంగా పాటించాలని లేనియేడల కఠిన చర్యలు తీసుకొవడం జరుగుతుందని హెచ్చారించారు. ఆధార్ కార్డు తీసుకోకుండా చెక్కులు ఇవ్వరాదని ఒక వేళ అలా ఇచ్చి ఉంటే అట్టి రైతుల నుండి తక్షనమే చెక్కు గాని ,ఆధార్ కార్డు గాని తీసుకోవాలని సూచించారు. భూమిలో ఎక్కువ ఉన్నటువంటి వాటిని ఫీల్డ్‌లో పరిశీలించి రైతులకు అక్కడే తగు ఉత్తర్వులు జారీ చేసి కంప్యూటరీకరణకు అవకాశం ఉన్నప్పుడు ఆన్‌లైన్ నమోదు చేయాలని తెలిపారు. రిజిష్టర్ల్లు అన్ని పక్కాగా ఉంచాలని అన్నారు. రిజిష్టర్ల్లు సరిగ్గా రాయని వారిని తక్షనమే అని పూర్తి చేయాలని అదేశించారు. ప్రభుత్వము కోత్తగా రెవెన్యూ యాప్ విడుదల చేసిందని అందరూ తహసిల్థార్లు విఆర్‌ఒలు, ఏఇఒలు డౌన్‌లోడ్ చేసుకొని వాటి ఆధారంగా రికార్డులు నమోదు చేయాలన్నారు. ఇప్పటి వరకు ఆధార్ ఇవ్వని రైతుల నుండి ఆధార్ తీసుకొని ధరణి వైబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అదేశించారు. ఆ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ సంయుక్త కలెక్టర్ డి వేణుగోపాల్, డిఆర్‌డిఎ అనంతరెడ్డి, తహసిల్థార్ తదితరులు పాల్గొన్నారు.

Related Stories: