ప్రభుత్వ పాఠశాలలకు రిసైక్లింగ్ బియ్యం సరఫరా…

కాసిపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యాసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్నా భోజనం కొరకు సన్న రకం బియ్యం పంపిణీ చేస్తుండగా ప్రభుత్వ ఆదేశాలను భేఖార్ చేస్తు రిసైక్లింగ్ చేసిన బియ్యంను పాఠశాలలకు పంపిస్తుండడంతో విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తినిలేని పరిస్థితులు నెలకొన్నాయి. పిఆర్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కంది కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 2018 జూన్ నెలలో పాఠశాలకు పంపిణీ చేసిన బియ్యం నాసిరకంగా వున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం 2017-2018 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు పంపిణీ చేసిన […]

కాసిపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యాసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్నా భోజనం కొరకు సన్న రకం బియ్యం పంపిణీ చేస్తుండగా ప్రభుత్వ ఆదేశాలను భేఖార్ చేస్తు రిసైక్లింగ్ చేసిన బియ్యంను పాఠశాలలకు పంపిస్తుండడంతో విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తినిలేని పరిస్థితులు నెలకొన్నాయి. పిఆర్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కంది కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 2018 జూన్ నెలలో పాఠశాలకు పంపిణీ చేసిన బియ్యం నాసిరకంగా వున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం 2017-2018 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు పంపిణీ చేసిన బియ్యం సంచులపై సమాచారం ముద్రించి వుండడం వల్ల సన్న రకం బియ్యం రావడం జరిగిందన్నారు. 2016-17 విద్య సంవత్సరంలో దొడ్డు బియ్యంను రిసైక్లింగ్ చేసి సన్న బియ్యంగా మార్చి పాఠశాలలకు పంపిణీ చేయడంతో నాడు ఉపాద్యాయులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడం, అధికారులు చర్యలు చేపట్టడంతో సన్న రకం బియ్యాన్ని పంపిణీ చేశారని, మళ్లీ ఈ విద్యా సంవత్సరంలో పాత విదానాన్నే కొనసాగిస్తున్నారని పలువురు ఉపాద్యాయులు సైతం ఆరోపిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తినలేని పరిస్థితిలో వున్నారని పౌర సరఫరాల శాఖ స్పందించి సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు సన్న రకం బియ్యం సరఫరా అయ్యేల చూడాలని ఉపాద్యాయులు కోరుచున్నారు.

Comments

comments

Related Stories: