ప్రభుత్వ కుట్రతోనే పంచాయతీ ఎన్నికలు వాయిదా

Postponed panchayat elections with government conspiracy

సర్పంచ్‌లనే పర్సన్‌ల్ ఇన్‌చార్జీలుగా

నియమించాలి
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన
ఘనత టిఆర్‌ఎస్ సర్కార్‌దే!
సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల
ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి

మనతెలంగాణ/రాయికల్: సమగ్ర కుటుంబ సర్వే వల్ల బిసిల సంఖ్య ప్రభుత్వం వద్దనే ఉందని ఈ బిసి గణన సంఖ్యను కోర్టుకు సమర్ఫించకుండా పంచాయతీ ఎన్నికల వాయిదాకు టిఆర్‌ఎస్ సర్కార్ కుట్ర పన్నిందని సిఎల్‌పి ఉపనేత,జగిత్యాల ఎంఎల్‌ఎ తా టిపర్తి జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాయికల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీల కు ఒక్క పైస నిధులు కేటాయించలేదని కేంద్ర ప్రభు త్వ నిధులతోనే కొంత అభివృద్ధి కనబడుతుందని చె ప్పారు. జిపిలకు నిధులు ఇవ్వకపోవడంతో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని అసంతృప్తి వ్యక్తం చే శారు.గ్రామపంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జ రుపకుండా మరో నాటకానికి కెసిఆర్ ప్రభుత్వం నా టకాలాడుతోందనివిమర్శించారు. తెలంగాణ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నరీతిలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని చెప్పారు. ఈ సర్వేలో బిసిల గణన జరిగిందని గుర్తు చేసారు. ప్రభుత్వానికి గ్రామపంచాయతీల ఎన్నికలు నిర్వహి ంచాలనే ఆలోచన ఉంటే కోర్టుకు బిసిల గణన నివేదిక అందజేసేదని తెలిపారు. ఈ బిసి గణన నివేదిక అందించకుండా పంచాయతీ ఎన్నికల వాయిదాకు కారణమైయ్యారని విమర్శించారు. 73,74 రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒ క్కసారి విధిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేసిన ప్రభుత్వ తీరువల్ల పథకాలు కుంటుపడేలా ఉందని అన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులతోనే కరంటు బిల్లులు, కంప్యూటర్ ఆపరేటర్ల బిల్లులు సర్పంచ్‌లే చెల్లించారని మండిపడ్డారు. రాష్ట్రంలో10వేల గ్రామపంచాయతీ లు ఉంటే ఆగస్టు 1 నుంచి మరో 4వేల గ్రామపంచాయతీలు నూతనంగా ఏర్పడనున్నట్లు వివరించారు. గ్రామపంచాయతీలకు అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులు లేరని ఫలితంగా చాలా గ్రామపంచాయతీలకు ఇన్‌చార్జీ పంచాయతీ కార్యదర్శులే పని చేస్తున్నారని తెలిపారు. అందుకే గ్రామపంచాయతీల కు సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలలో చైర్మన్‌ల పదవి కాలం పూర్తయినప్పటికి అదే చైర్మన్‌లను ఇన్‌చార్జులుగా కొనసాగిస్తున్నారని అలాగే సర్పంచ్‌లనే పర్శన్ ఇన్‌చార్జులుగా కొనసాగించాలని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ది కోసం అమలు చేసిన మన ఊరు మన ప్రణాళిక కాగితాలకే పరిమితమైందని, గ్రామజ్యోతి వెలుగలేదని విమర్శించారు. సర్పంచ్‌లనే పర్సన్‌ల్ ఇన్‌చార్జ్‌లుగా నియమించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల స మావేశంలో పార్టీ నాయకులు గోపి రాజరెడ్డి, పడిగెల రవింధర్‌రెడి, ఏనుగు మల్లారెడ్డి, గడ్డం గంగారెడ్డి, ఎద్దండి దివాకర్‌రెడ్డి, కొయ్యడి మహిపాల్‌రెడ్డి, జకిలేటి హారీష్‌రావు, గుర్రం మహేంధర్‌గౌడ్, మున్నూ, క ట్కం రాజేశం, ్డ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments