ప్రభుత్వ ఉద్యోగి హత్య

పాట్నా : బిహార్ రాజధాని పాట్నాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. పాట్నా సచివాలయంలో పని చేస్తున్న రాజీవ్‌కుమార్ ఇంట్లోకి మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు దొంగలు చొరబడ్డారు. రాజీవ్‌ను బంధించి నగదు, నగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్ వారిని ప్రతిఘటించడంతో కాల్పులు జరిపి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం వారు ఇంట్లోని నగదును, నగలను ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన రాజీవ్‌ను ఆయన భార్య తక్షణమే ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజీవ్ చనిపోయాడు. […]

పాట్నా : బిహార్ రాజధాని పాట్నాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. పాట్నా సచివాలయంలో పని చేస్తున్న రాజీవ్‌కుమార్ ఇంట్లోకి మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు దొంగలు చొరబడ్డారు. రాజీవ్‌ను బంధించి నగదు, నగలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్ వారిని ప్రతిఘటించడంతో కాల్పులు జరిపి తీవ్రంగా గాయపర్చారు. అనంతరం వారు ఇంట్లోని నగదును, నగలను ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన రాజీవ్‌ను ఆయన భార్య తక్షణమే ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజీవ్ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Government Employee Murder in Patna

Comments

comments