ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలి

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి  మన తెలంగాణ/నిర్మల్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకునేలా గర్భిణీలను ప్రోత్సహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర స్థాయిలో అధిక శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా వైద్య సిబ్బంది, డాక్టర్లు గర్బిణీలను ప్రోత్సహించాలన్నారు. అలాగే ప్రభుత్వం ఆసుసత్రిలో ప్రసవాలు జరిగే కలిగే లాభాల […]

నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి 

మన తెలంగాణ/నిర్మల్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకునేలా గర్భిణీలను ప్రోత్సహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర స్థాయిలో అధిక శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా వైద్య సిబ్బంది, డాక్టర్లు గర్బిణీలను ప్రోత్సహించాలన్నారు. అలాగే ప్రభుత్వం ఆసుసత్రిలో ప్రసవాలు జరిగే కలిగే లాభాల గురించి వివరించాలన్నారు. ప్రతీ ఆరోగ్య కేంద్రం వద్ద ఆ ఆసుపత్రి పరిధిలోని గర్భిణీల ప్రసవాల తేది, వారి మొక్క ఫోన్ నెంబర్ ప్రదర్శించాలన్నారు. గర్భిణీలకు వారు ప్రసవించే తేదీని వారం రోజుల ముందు నుంచే ఫోన్ ద్వారా గాని, ఇంటికి వెళ్లి తెలియజేయాలన్నారు. అలాగే 102,108 వాహనాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. గిరిజనులు, గోండు గర్భిణీలను తీసుకొని వచ్చేందుకు 102 వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే సోన్, ముజ్గి, లక్ష్మణచాంద, బొప్పారం ఆరోగ్య కేంద్రాల్లో తక్కువ స్థాయి ప్రసవాలు జరుగడంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంబి, తానూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ ప్రసవాలు జరగడంతో సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జలపతి నాయక్, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డా॥ సురేష్, డా॥ కార్తీక్, వైద్యులు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.

Related Stories: