ప్రభాస్ నా ఫేవరేట్ హీరో

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై జగపతిబాబు, నారా రోహిత్ హీరోలుగా దర్శన బానిక్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘ఆటగాళ్లు’. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక దర్శన బానిక్‌తో ఇంటర్వూ… మోడలింగ్ నుంచి సినిమాల్లోకి… కోల్‌కతా మా స్వస్థలం. మోడల్‌గా రాణించిన అనంతరం సినిమాల్లోకి వచ్చాను. బెంగాలీలో ఆరు […]

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై జగపతిబాబు, నారా రోహిత్ హీరోలుగా దర్శన బానిక్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘ఆటగాళ్లు’. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక దర్శన బానిక్‌తో ఇంటర్వూ…

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి…

కోల్‌కతా మా స్వస్థలం. మోడల్‌గా రాణించిన అనంతరం సినిమాల్లోకి వచ్చాను. బెంగాలీలో ఆరు సినిమాల్లో నటించాను. ఓ బెంగాలీ వెబ్ సిరీస్‌లో కూడా నటించాను. తెలుగులో నా మొదటి చిత్రం ‘ఆటగాళ్లు’.
ఆవిధంగా హీరోయిన్‌గా…
గత ఏడాది ముంబయిలో ఓ వీడియో సాంగ్‌లో నటించాను. దాని కొరియోగ్రాఫర్ విష్ణుదేవా నా ఫొటోలను ఈ చిత్ర దర్శక నిర్మాతలకు పంపించారు. ఆతర్వాత నిర్వహించిన ఆడిషన్స్‌లో నన్ను హీరోయిన్‌గా ఎంపికచేశారు.
సిన్సియర్‌గా లవ్ చేసే…
సినిమాలో నా పాత్ర పేరు అంజలి. హీరోను సిన్సియర్‌గా లవ్ చేసి అతన్నే పెళ్లి చేసుకోవాలనుకునే హీరోయిన్ పాత్ర నాది. హీరోయిన్‌గా నాకు మంచి పేరు తెచ్చే చిత్రమిది.
చక్కగా తెరకెక్కించారు…
‘ఆటగాళ్లు’లో నారా రోహిత్, జగపతిబాబు పాత్రలు హైలైట్‌గా ఉంటాయి. ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. వారి మధ్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మా దర్శకుడు మురళి ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు. ఇక షూటింగ్ సమయంలో నారా రోహిత్, బాగా సహకరించారు.
బాహుబలి నచ్చింది…
తెలుగు సినిమాలు బెంగాలీలోకి డబ్ అవుతాయి. అలా తెలుగు సినిమాలను నేను చూశాను. ముఖ్యంగా మగధీర, ఆర్య, ధృవ, అరుంధతి, బాహుబలి సినిమాలను చూడడం జరిగింది. నాకు బాహుబలి చిత్రం బాగా నచ్చింది. ఇక నేను తెలుగు అర్థం చేసుకోగలను కానీ మాట్లాడలేను. నెక్స్ సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాను.
పెద్దగా వ్యత్యాసం ఉండదు…
తెలుగు సినిమాలు, బెంగాలీ సినిమాలకు పెద్దగా వ్యత్యాసం ఉండదు. ఎక్కడైనా కష్టపడే పనిచేయాలి… ప్యాషన్‌తోనే నటించాలి. కాకపోతే తెలుగు సినిమాల బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
రాజమౌళికి పెద్ద అభిమానిని…
బాలీవుడ్‌లో నాకిష్టమైన హీరో షారుఖ్‌ఖాన్. ఇక తెలుగులో నా ఫేవరేట్ హీరో ప్రభాస్. బాహుబలి సినిమా చూసి ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాగే అల్లు అర్జున్ అంటే కూడా నాకు చాలా బాగా ఇష్టం. దర్శకుల్లో రాజమౌళికి పెద్ద అభిమానిని.

Comments

comments