ప్రపంచ సాహిత్యంలో తెలంగాణ అక్షరాల జెండా

సాహితి లబ్ద ప్రతిష్టునుకి నిలువెత్తు గౌరవం, సాహితి ప్రియుల హర్షాతిరేకాలు, సిధారెడ్డికి సాహిత్య అకాడమి చైర్మన్ పదవి

Litarature

సిద్దిపేట ప్రతినిధి: తెలంగాణ ఆధునిక కవిత్వానికి సరికొత్త దారులు పరచిన నందిని సిధారెడ్డికి తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ పదవిని వరించడం పట్ల సాహితీ ప్రియుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి ధిక్కార స్వరానికి లభించిన గౌరవ మని, నందిని సిధారెడ్డికి నిలువెత్తు గౌరవమని సాహితీ అభిమానులు పేర్కొంటున్నారు. నిర్లక్షానికి గురైన తెలంగాణ సాహిత్యాన్ని, సంస్కృతిని వెలుగులోకి తీసుకవచ్చి ప్రజల చెంతకు చేర్చడంలో సిధారెడ్డి పాత్ర అమోఘమైనది. తెలంగాణ ఉద్యమానికి, సాహిత్యానికి సిధారెడ్డి చోదక శక్తిగా పని చేయడమే కాకుండా కేసీఆర్ వెన్నంటి నడిచాడు. తెలంగాణ మాండలికాన్ని ముందుకు తీసుకపోవ డంలో నందిని సిధారెడ్డి పాత్ర మరవలేనిది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో 1955లో నందిని సిధారెడ్డి జన్మించారు.

పాఠశాల విద్యాభ్యాసం బందారం, వెల్కటూర్‌లలో సాగగా, కళాశాల జీవితం సిద్దిపేటలో పూర్తి చేసుకుని ఉస్మానియా యూనివర్సీటీలో ఎం.ఎ తెలుగు పూర్తి చేశా రు. ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై 1981లో ఎంఫిల్‌ను పూర్తి చేసి పట్టా పొం దారు. 1986లో ఆధునిక కవిత్వం, వాస్తవికత – ఆదివాస్తవికత పై పరిశోధన చేసి పి.హెచ్‌డి పట్టాను పొందారు. మెదక్, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి 2012లో పదవి విరమణ పొందారు. విద్యార్థి దశనుంచే కథలు, కవిత్వం, రాయడం మొదలు పెట్టారు. నవసాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నడపడమే కాకుండా మంజీర రచయితల సంఘంను ఏర్పాటు చేసి ఎన్నొ సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. మంజీరా బులెటిన్‌కు సంపాదకత్వం వహించి ఏడు కవితా సంకలనాలను వెలువరించారు.

సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997 ఆగస్టులో కేవలం ఒకే ఒక గంట వ్యవధిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం – ఆవశకతపై సిధారెడ్డి రచించిన కవితే ‘నాగే టీ చాలల్ల నా తెలంగాణ…నాతెలంగాణ’గా ప్రసిద్ది పొందింది. ఈ కవితలో నందిని సిధారెడ్డి తెలం గాణ సంస్కృతి మొత్తాన్ని వివరించారు. ఇదే కవితను ‘పోరు తెలంగాణ’ సినిమాలో పాటగా తీసుకు న్నారు. ఈ పాఠకు నందిని సిదారెడ్డికి నంది అవార్డు లభించింది. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడానికి దశాబ్ద కాలం ముందు సారా వ్యతిరేకోద్యమంలో క్రీయాశీలకంగా పనిచేశారు.

సాహితీ మిత్రుల సంబురాలు…

నందిని సిధారెడ్డికి తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్‌గా నియ మితులు కావడంతో సిద్దిపేట సాహితీ మిత్రులు, అభిమానుల్లో సంబురాలు మిన్నంటాయి. తెలంగాణ రచయితల సంఘం, మంజీర రచయితల సంఘం సారధులు తోట అశోక్, పొన్నాల బాలయ్య, గం భీర్‌పేట యాదగిరి, రంగాచారి, తైదల అంజయ్య, అలాజీపూర్ శ్రీనివాస్, తిరుపతిరెడ్డిలు హర్షాన్ని ప్రకటించడమే కాకుండా ఈ పదవికి ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై తెలంగాణ మాండ లికం శిరస్సు ఎత్తుకుంటుందని, ప్రపంచ సాహిత్యంలో తెలంగాణ అ క్షరాల జెండా ఎగురబోతోందని అభివర్ణించారు. బహు జన పరివర్తన సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. భీమసేన, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్ర తినిధి గుర్రాల శ్రీనివాస్ మాదిగలతో పాటు భైరయ్య, శేఖర్ నరహరి లో హర్షం వ్యక్తం చేశారు.
నందిని సిధారెడ్డి రచ నలు… భూమి స్వ ప్నం, సంభాషణ, ప్రాణహిత, ఒక బాధగాదు, నది పుట్టువడి, ఇక్కడి చెట్టు గాలి
వ్యాస సంపుటి లు… ఇగురం, ఆవర్తనం, నాగేటి సాల ల్ల (పాటల పుస్త కం), చిత్ర క న్ను (కథల సంపుటి)

Comments

comments