ప్రపంచంలో ఐదో స్థానంలో హిందీ

ప్రపంచం మొత్తం మీద మాట్లాడే భాషల్లో హిందీ ఐదో స్థానం సాధించింది. దాదాపు 260 మిలియన్ మంది ప్రపంచంలో హిందీ మాట్లాడుతున్నారు. వరల్డు ఎకనామిక్ ఫోరం తన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచంలో స్పానిస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల మాదిరిగా అదే వరుసలో ఎప్పుడూ హిందీ ఉంటోంది. భారతదేశ భాష అయిన బెంగాలీ ఆరో స్థానంలో ఉండటం విశేషం. అధికారికంగా 242 మంది బెంగాలీని మాట్లాడుతున్నారు. జాబితాలో హిందీని అరేబియా భాష అధిగమించింది. అన్ని భాషలకన్నా […]

ప్రపంచం మొత్తం మీద మాట్లాడే భాషల్లో హిందీ ఐదో స్థానం సాధించింది. దాదాపు 260 మిలియన్ మంది ప్రపంచంలో హిందీ మాట్లాడుతున్నారు. వరల్డు ఎకనామిక్ ఫోరం తన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచంలో స్పానిస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల మాదిరిగా అదే వరుసలో ఎప్పుడూ హిందీ ఉంటోంది. భారతదేశ భాష అయిన బెంగాలీ ఆరో స్థానంలో ఉండటం విశేషం. అధికారికంగా 242 మంది బెంగాలీని మాట్లాడుతున్నారు. జాబితాలో హిందీని అరేబియా భాష అధిగమించింది. అన్ని భాషలకన్నా చైనా భాష మాట్లాడే వారు 1284మిలియన్ మంది ప్రపంచంలో ఉండగా, తరువాత స్థానంలో స్పానిష్ భాష ఉంది. స్పానీష్‌ను 437మిలియన్ల మంది మాట్లాడుతున్నారు. ప్రపంచ భాషలపై జరిగిన అధ్యయనంలో స్పానిష్, ఇంగ్లీష్, అరబిక్ భాషలకన్నా ఎక్కువ మంది చైనా భాషనే మాట్లాడుతున్నారని తేలింది. ఇంగ్లీష్ అధికార భాషగా 106 దేశాల్లో ఉంటోంది. భారతీయుల మాతృభాష హిందీ లేదా బెంగాలీ ప్రాధాన్యం వహిస్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద భారతీయ భాషలు ముఖ్యం. ఎందుకంటే జనాభా విషయంలో భారత్ ప్రపంచ మొత్తం మీద రెండో దేశంగా ఉంటోంది. అర్ధికంగా ప్రగతి సాధిస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనెడా, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో భారతీయ భాషలు విస్తరించాయి. విదేశాల్లోని అనేక రాష్ట్రాల్లో విద్యావిధానంలో హిందీ, పంజాబీ, బెంగాలీ వంటి భారతీయ భాషలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. మాతృ భాష బెంగాలీగా 97 మిలియన్ల మంది దేశంలో ఉన్నారు. విదేశాల్లో వలస వెళ్లినా తమ మాతృభాషా సంస్కృతిని సజీవంగా కాపాడగలుగుతున్నారు. అయితే బ్రిటన్ వంటి దేశాల్లో హిందీని వెనక్కు నెట్టి అరబ్బీ భాషను ప్రోత్సహిస్తుంన్నారు. యూనివర్శిటీలు అరబ్బీ భాషలో ప్రత్యేక కోర్సులు ప్రారంభించారు. ప్రపంచం మొత్తం మీద బాగా వాడుకలో ఉన్న భాషలు (2017 అంచనా ప్రకారం)
చైనా 1284 మిలియన్ల మంది
స్పానిస్ 437, ఇంగ్లీష్ 372
అరబ్బీ295,  హిందీ 260
బెంగాలీ 242, పోర్చుగీసు 219
రష్యా 154, జపనీస్ 128
అహండా 119

-మన తెలంగాణ/ పరిశోధన విభాగం