ప్రత్యేక రాజ్యాంగం అసాధారణమైంది

భారత సార్వభౌమత్వానికి అది భంగకరం
జమ్ము కశ్మీర్‌పై జాతీయ భద్రతా
సలహాదారు దోవల్ సంచలన వ్యాఖ్యలు

Jammu-Kashmir

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం అసాధారణమైన అంశమని, ఇది భారత సార్వభౌమత్వానికి భం గకరమని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ అన్నారు. భారత సార్వభౌమత్వంపై ఎట్టి పరిస్థితిలోనూ రాజీపడకూడదని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఎ ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ఓ వైపు జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యా ఖ్యలు చేశారు. ఆర్టికల్ 35ఎ జమ్మూ కశ్మీర్‌లోని శాశ్వత పౌరులకు కొన్ని ప్రత్యేకమైన హక్కు లు, అధికారాలను కలిగిస్తుంది. దీనిని ప్రస్తావించిన దోవల్ ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన రాజ్యాంగం అనేది అసాధారణమైన విషయమని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌పై రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, పటేల్‌కు ఘనంగా నివాళులర్పించారు. స్వతంత్ర భారత తొలి హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పటేల్ దేశానికి ఎంతో సేవ చేశారని,సుస్థిరమైన దేశ నిర్మాణంలో ఆయన చెప్పుకోదగిన సహకారం అందించారని ఆయన అన్నా రు. దేశ సార్వభౌమత్వాన్ని పలుచన కానీయకూడదు, దానిని బలహీన పరచకూడదని దోవల్ చెప్పారు.

బ్రిటీష్ వారు మన దేశం విడిచిపెట్టి వెళ్లడానికి ఇష్టపడలేదని, మన దేశం బలమైన సార్వభౌమత్వం కలిగి ఉండకూడదని వారు భావించారని ఆయన అన్నారు. భారత్‌లో విచ్ఛిన్నకర విష బీజాలు నాటడానికి ప్రయత్నించారని, వారి కుయుక్తులను పటేల్ గమనించారని ఆయన అన్నా రు. ఇటువంటి సమయంలో దేశం విచ్ఛి న్నం కాకుండా అన్ని రాష్ట్రాలు భారత్‌లో భాగస్వామ్యం కావడానికి వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని దోవల్ చెప్పారు. రాజ్యాంగం సార్వభౌమత్వాన్ని ప్రసాదించిందని, ఇది భారతదేశమంతటికీ వర్తిస్తుందని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీర్ విషయంలో రాజ్యాంగం కొంత తగ్గించిన స్థాయిలో ఉండేదని, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాం గం అనేది అసాధారణమైందని జాతీయ భద్రతా సలహాదారుడు దోవల్ అన్నారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సమావేశంలో మాట్లాడిన ఆయన భారతదేశలోని సంస్థానాలు భారత్‌లో కలవాలా వద్దా అనేది ఆ సంస్థానాలే నిర్ణయం తీసుకోవాలని బ్రిటీష్ పాలకులు భావించారని, దేశంలో అస్థిరత నెలకొనాలని వారు ఆశించారని ఆయన అన్నారు. అటువంటి సమయంలో పటేల్ అన్ని సంస్థాలను కలిపి భారత్ అవతరించడానికి ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.

వ్యాఖ్యలపై పిడిపి మండిపాటు

భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో ఒకప్పటి భాగస్వామి పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి)దోవల్ వ్యాఖ్యలపై మండిపడింది. దోవల్ అనుచితమైన తీరులో మాట్లాడారని తప్పు పట్టింది. కశ్మీర్ ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, రాజకీయ అనిశ్చితి కొనసాగుతోందని, ఇటువంటి సమయంలో దోవల్ కశ్మీర్ ప్రజలపై చేసిన వ్యాఖ్య లు దురదృష్టకరమైనవని పిడిపి నేత రఫీ మీర్ అన్నారు. ముస్లింలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం రెండు దేశాలు కావాలని కోరుకోవడంలేదని, దేశంలో అత్యధిక సంఖ్య లో ఉన్న హిందువులపై నమ్మకంతో ముస్లింలు కలిసి జీవిస్తున్నారని ఆయన చెప్పారు. తాము అణచివేతకు గురవుతున్నామని, తమ రాష్టానికి ఇచ్చిన ప్రత్యేక హోదా కి భంగం కలిగించే రీతిలో ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదా దేశ సార్వభౌమత్వానికి ఎటువంటి హాని కలిగించడం లేదని పిడిపి నేత రఫీ మీర్ అన్నారు. దోవల్ ఈ విషయాలని గమనించాలని ఆయన కోరారు.

ఆర్టికల్ 35ఎ ని కాపాడండి: ఫరూఖ్ అబ్దుల్లా

రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఎని కాపాడాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఆర్టికల్ 35ఎ పై వాదనలు వినడానికి గతవారం సుప్రీంకోర్టు నిరాకరించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆర్టికల్ 35ఎ జోలికి రావద్దని కేంద్రాన్ని ఆయన హెచ్చరించారు.ఆర్టికల్ 35ఎ జమ్మూ కశ్మీర్ ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు, అధికారాలను ప్రసాదిస్తోంది. ఈ ఆర్టికల్‌ని తొలగిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని, ఒకవేళ కేంద్రం ఈ ఆర్టికల్‌ని మార్చడానికి ప్రయత్నించే పక్షంలో తాము రాబోయే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 35ఎపై తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ రాష్ట్రానికి రాజ్యాం గం ప్రసాదించిన హక్కులనున హరించే ప్రయత్నం చే యొద్దని, అటువంటి ప్రయత్నం చేస్తే తాము దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అబ్దుల్లా హెచ్చరించారు.

Comments

comments