ప్రత్యేక పసుపు సెల్

కేంద్రం ఏర్పాటు చేస్తోంది తగిన కార్యాచరణ రూపొందించడానికే వర్క్‌షాప్ సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రదర్శనలో ఎంపి కవిత రబ్బర్, సిల్క్ బోర్డు మాదిరిగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ మన తెలంగాణ/ హైదరాబాద్: రబ్బర్, సిల్క్ కు బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. అలాగే పసుపుకి కేంద్ర ప్రభుత్వం కనీస మద్ద తు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో […]

కేంద్రం ఏర్పాటు చేస్తోంది
తగిన కార్యాచరణ రూపొందించడానికే వర్క్‌షాప్
సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రదర్శనలో ఎంపి కవిత
రబ్బర్, సిల్క్ బోర్డు మాదిరిగానే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

మన తెలంగాణ/ హైదరాబాద్: రబ్బర్, సిల్క్ కు బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. అలాగే పసుపుకి కేంద్ర ప్రభుత్వం కనీస మద్ద తు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాగవుతున్న పసుపు పంట రకాలు, ఉత్పాదకత పెంపు, మార్కెటింగ్ మెళకువలు, ఎగుమతులపై అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్‌లోని బేగంపేట హరిత ప్లాజాలో సుగంధ ద్రవ్యాల బోర్డు సోమవారం వర్క్ షాప్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి, బోర్డు ఏర్పాటుకు ఐదుగు రు సిఎంల మద్దతు లేఖలను ఇచ్చిన విషయా న్ని గుర్తుచేశారు. కేంద్రం ప్రత్యేక పసుపు సెల్ ఏర్పాటు చేస్తోందని, అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించడం కోసమే వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పసుపు సాగు ను లాభసాటిగా మారుస్తామని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు తాను ఎంపి అయ్యాక లోక్‌సభలోనూ పసుపు బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. స్పైస్‌పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బాల్కొండ నియోజక వర్గంలోని వేల్పూర్‌లో 42 ఎకరాల స్థలాన్ని కేటాయించి, రూ.30 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు . జీన్ బ్యాంక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉడక బెట్టిన పసుపు ఎండబెట్టేందుకు యంత్రాల అందుబాటుపై కేంద్రం అధ్యయనం చేయాలని సూచించారు. 1990 లో 7 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి కాగా ప్రస్తుతం 3లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయిందని, దీనికి కారణాలను అన్వేషించాలని అన్నారు. ఎగుమతులు కూడా 6 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ఈ వర్క్‌షాప్‌లో బోధన్ ఎంఎల్‌ఎలు షకీల్ అహ్మద్, జీవన్ రెడ్డి రైతులు, ట్రేడర్లు, సైంటిస్టులు, అధికారులు ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు.
కేంద్రానికి రైతుల డిమాండ్లు: పసుపు కర్కుమిన్ నాణ్యతను పరీక్షించే విధానం మార్కెట్లలో ఉండాలని రైతులు డిమాండ్ చేశారు. నిల్వ చేసుకునేందుకు కోల్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలని కోరారు. పసుపును ఆరబెట్టేందుకు సామూహిక కల్లాలను నిర్మించాలన్నారు.

Related Stories: