ప్రత్యర్థి టిడిపితో పొత్తు నిజమే

ఫేస్‌బుక్‌లో ప్రియాంకగాంధీ   మనతెలంగాణ/హైదరాబాద్ : ఒకప్పుడు రాజకీయ భిన్న ధృవాలైన, ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, టిడిపిలు త్వరలోపొత్తు పెట్టుకోబోతున్నాయని సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ సోమవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. మరికొన్ని చిన్న పార్టీలను కలుపుకుని కూటమిగా ఏర్పడనున్నాయని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈ పార్టీలన్నీ ఒకే గొడుకు కిందకు వస్తున్నాయని తెలిపారు. వాస్తవానికి పొత్తులపై అటు టిడిపి, ఇటు కాంగ్రెస్ అధిష్టానాలు ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. […]

ఫేస్‌బుక్‌లో ప్రియాంకగాంధీ  

మనతెలంగాణ/హైదరాబాద్ : ఒకప్పుడు రాజకీయ భిన్న ధృవాలైన, ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, టిడిపిలు త్వరలోపొత్తు పెట్టుకోబోతున్నాయని సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ సోమవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొన్నారు. మరికొన్ని చిన్న పార్టీలను కలుపుకుని కూటమిగా ఏర్పడనున్నాయని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈ పార్టీలన్నీ ఒకే గొడుకు కిందకు వస్తున్నాయని తెలిపారు. వాస్తవానికి పొత్తులపై అటు టిడిపి, ఇటు కాంగ్రెస్ అధిష్టానాలు ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు త్వరలో కుదురుతుందని ప్రియాంక గాంధీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ సంచనలం సృష్టిస్తుస్తున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మకాం వేసి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు పొత్తుకు సంబంధించిన చర్చలు జరిపారు. పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర విభాగమేనని పూర్తి అధికారాన్ని అప్పజెప్పారు.

కాంగ్రెస్ వ్యతిరేక పార్టీకీ పొత్తు తప్పలేదు :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేళ్ళపాటు ఉద్యమం చేసి డిమాండ్‌ను సాకారం చేసుకున్న టిఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టి అధికారాన్ని అప్పగించారు. నాలుగున్నరేళ్ళలో దేశంలో మరే రాష్ట్రంలో లేనంత ఆర్థిక వృద్ధిని సాధించింది. వినూత్న సంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబాన్ని ఏదో ఒక రూపంలో స్పృశించింది. ఈ పథకాల ఫలాలు ప్రజలందరికీ స్వీయానుభవం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నల్లేరుమీద బండి నడకలా టిఆర్‌ఎస్ గెలుపు సునాయాసమేనని ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు వ్యాఖ్యానించి విధిలేని పరిస్థితుల్ల సిద్ధాంతాలను, భావజాలాన్ని పక్కనబెట్టి కేవలం టిఆర్‌ఎస్‌ను ఓడించాలన్న ఉద్దేశంతోనే అపవిత్ర పొత్తులకు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. అయితే ఇప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తుపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కానీ ప్రియాంకాగాంధీ మాత్రం ఫేస్‌బుక్ ద్వారా ఖరారుచేయడంతో ఒక్కసారిగా రెండు పార్టీల నేతల్లో గుబులు పుట్టింది. ఇంకా పొత్తు చర్చల ప్రక్రియ పూర్తికాకముందే ఈ వార్త సోషల్ మీడియాకు ఎక్కడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Comments

comments

Related Stories: