ప్రతి పిఎస్‌లో ప్రత్యేక పోలీసు అధికారులు

ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ మన తెలంగాణ/ఆదిలాబాద్: కేసు దర్యాప్తును ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు ప్రతి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక పోలీసు అధికారులను నియమించినట్లు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సమావేశ మందిరంలో సిసిటిఎస్‌యస్ అధికారులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలీసుస్టేషన్ల వారీగా నమోదైన కేసులతో పాటు దర్యాప్తు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను విశ్లేషించారు. పోలీసు స్టేషన్‌లో […]

ఎస్పీ విష్ణు ఎస్ వారియర్

మన తెలంగాణ/ఆదిలాబాద్: కేసు దర్యాప్తును ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసేందుకు ప్రతి పోలీసు స్టేషన్‌లో ప్రత్యేక పోలీసు అధికారులను నియమించినట్లు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు సమావేశ మందిరంలో సిసిటిఎస్‌యస్ అధికారులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలీసుస్టేషన్ల వారీగా నమోదైన కేసులతో పాటు దర్యాప్తు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను విశ్లేషించారు. పోలీసు స్టేషన్‌లో రైటర్‌తో పాటు సిసిటిఎన్‌యస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ సిస్టం) విభాగాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీసు అధికారులు పనిచేస్తారని, కేసు నమోదైన వెంటనే ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడంతో పాటు దర్యాప్తుకు అనుగుణంగా ప్రతి రోజు పూర్తి వివరాలు అప్‌లోడ్ చేస్తారని ఎస్‌పి తెలిపారు. ఈ నెట్‌వర్క్ సిస్టం డిఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మా ట్లాడుతూ పోలీసుస్టేషన్‌లో దర్యాప్తును పకడ్బందీగా అమలు చేయడానికి, వారి దర్యాప్తు వివరాలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోలీసు అధికారులు సైతం వీక్షించే విధంగా వెసులుబాటు ఉందని తెలిపారు. పోలీసులు పారదర్శకమైన దర్యాప్తు చేస్తున్నారా లేదా అనే కోణంలో సైతం నిఘా ఉంటుందని తెలిపారు. కేసు నమోదు నుంచి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేసేంత వరకు దర్యాప్తు పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో ఉండడంతో కాగితరహితంగా కొనసాగేందుకు వెసులు బాటు కల్గుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాదు మోహన్‌రెడ్డి, ఆదిలాబాద్, ఉట్నూర్ డిఎస్పీలు కే నర్సింహారెడ్డి, ఎన్ వెంకటేష్, జిల్లా పోలీసు కంప్యూటర్ విభాగం అధికారి సింగజ్‌వార్, సంజీవ్‌కుమార్, పరీవేక్షికులు శ్రీధర్, కిషోర్, మాజిద్, రియాజ్, ఆవినాష్ స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.

Related Stories: