ప్రతి ఒక్కరికీ నులిపురుగుల నివారణ మాత్రలు

మన తెలంగాణ/మెదక్ : జిల్లాలోని ప్రతి ఒక్కరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందజేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నులిపురుగుల వల్ల కలిగే రక్తహీనతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు నులిపురుగుల నివారణ మాత్రలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. పిల్లలలో నులిపురుగుల కారణంగా రక్తహీనత పోషకాల లోపం. ఆకలి లేక […]

మన తెలంగాణ/మెదక్ : జిల్లాలోని ప్రతి ఒక్కరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందజేయాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నులిపురుగుల వల్ల కలిగే రక్తహీనతను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు నులిపురుగుల నివారణ మాత్రలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. పిల్లలలో నులిపురుగుల కారణంగా రక్తహీనత పోషకాల లోపం. ఆకలి లేక పోవుట, బలహీనత, కడుపునోప్పి, విరేచనాలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఆరుబయట వట్టికాళ్ళతో ఆడుకోవడం, చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని భుజించుట, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయుట వంటి కారణాలతో పిల్లల్లో నులిపురుగుల వ్యాప్తి చెందుతాయన్నారు. ఈ మాత్రలను ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు తప్పనిసరిగా వేయించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకునే పిల్లలకు సైతం తప్పనిసరిగా ఈ మాత్రలను అందజేయాలన్నారు. రెండు సంవత్సరాలలోపు పిల్లలకు సగం మాత్ర, 10 సంవత్సరాలు పైబడిన పిల్లలకు ఒక టాబ్లెట్‌ను వేయడం జరుగుతుందన్నారు. రెండు సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్‌వాడీ ఆయాలు లేదా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి నులిపురుగుల నివారణ మాత్రలను వేయించే బాధ్యత తీసుకోవాలని ఐసిడిఎస్ పిడి జ్యోతిపద్మను ఆదేశించారు. అంతేకాకుండా బడి బయట పిల్లలను గుర్తించి వారికి కూడా నివారణ మాత్రలు అందజేయాలని ఆదేశించారు. 10వ తేదీ నాడు వేయని విద్యార్థులకు, పిల్లలకు 17వ తేదీన తిరిగి మాత్రలు అందజేస్తామని తప్పకుండా తల్లిదండ్రులు ప్రత్యేక చోరవ తీసుకోని మాత్రలను వేయించాలని కలెక్టర్ సూచించారు. కాస్త బలహీనంగా ఉన్న విద్యార్థులపై పర్యవేక్షణ ఉండాలన్నారు. కళాశాల స్థాయిలో విద్యార్థులు నులిపురుగుల మాత్రలు ఎందుకు వాడతారని, నులిపురుగులు ఎందుకు వస్తాయి లేదా వాటి వలన కలిగే అనర్ధాలను పూర్తిస్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడంపై విద్యార్థుల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. అంతకుముందు నులిపురుగుల నివారణ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, డిఆర్‌డివో సీతారామారావు, డిడబ్లువో జ్యోతిపద్మ, డిఎస్సీడివో మహేశ్వర్, బిసీడబ్లువో సుధాకరర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి

Comments

comments

Related Stories: