ప్రతి ఊరికి మిషన్ భగీరథ

August 31, provide drinking water Mission Bhagiratha

మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి ఊరికి ఆగస్టు 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌర స రఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామీణ అభివృద్ధి పై ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనులలో వేగం పెంచాలని,నిర్ణీత గడువులోగా పనులన్ని పూర్తి చే యాలని ఆదేశించారు.మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందన్నారు. మిషన్ భగీరథ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. వచ్చే దసరాలోగా మిషన్ భగీరథ ద్వారా ఇ ంటింటికి నల్లా ద్వారా స్వచ్చమైన తాగునీటిని అందివ్వాలని ఆదేశించారు.మిషన్ భగీరథ పనులపై ప్రతివారం మండల స్థాయిలో ఎంపిపిలు, జడ్‌పిటిసిలతో, ఏఇలతో, డిఇలతో సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని సూ చించారు. ప్రతి 15రోజులకు ఒకసారి మిషన్ భగీరథ ఇం జనీర్లు కాంట్రాక్టర్లతో పనులు ప్రగతిపై సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని సమస్యలుంటే వెంటవెంటనే పరిష్కరించుకొని పనులలో వేగం పెంచుకోవాలని సూచించా రు.అలాగే మిషన్ భగీరథ పనులపై ప్రతినెల ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో తానే స్వయంగా సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పనులలో ఏమైనా సమస్యలుంటే వెం టనే తమ దృష్టికి తేవాలని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. మండలాల వారిగా ఏ గ్రామానికి ఎప్పుడు ఏ తేదీన నీ రు అందిస్తారో కార్యాచరణ ప్రణాళిక లు తయారు చేసుకోవాలని సూచించారు.అలాగే ఇంట్రావిలేజ్ పనులలో భాగంగా ఏ గ్రామంలో పూర్తి స్థాయిలో ఏ తేదీన ఇంటింటికి నల్లా నీరు సరఫరా చేస్తారో ప్రణాళికలు తయారు చేసుకొని షెడ్యూల్ ప్రకారం పనులను చేయాలని ఆదేశించారు.
గ్రామాల్లో ఇంటింటికి నల్లా నీరు సరఫరా చేయు పథకం మిషన్ భగీరథ నిర్వహణ బాధ్యత వచ్చే పది సంవత్సరాలు సంబంధిత ఎజెన్సీలదేనని తెలిపారు. ఏ వైనా పైపులు పగిలినా,లీకేజీలున్న ఏజెన్సీలే మరమ్మతులు చేస్తారని,గ్రామస్థులకు ఏలాంటి బాధ్యత లేదన్నారు. క రీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇది వరకే వచ్చే 30 సంవత్సరా ల జనాభాకు సరిపోయే విధంగా ఎన్నో వాటర్ ట్యాంకులు మంజూరు చేశామని ఇంకను అవసరమున్నచో వెంటనే ప్ర తిపాదనలు సమర్పించాలని సూచించారు.
గ్రామాలలో ఎసి,ఆర్సీసి పైపులైన్లను మార్చాలి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గతంలో గ్రామాలలో త్రాగునీటి సరఫరాకు వేసిన ఎసి,ఆర్సీసి పైపులైన్లను మొత్తం మార్చి వాటి స్థానంలో కొత్తగా హెచ్‌డిపి పైప్‌లైన్లను వేయాలని ఇంజనీర్లను ఆదేశించారు.ఈ పథకం ద్వారా నాణ్యమైన హెచ్‌డిపి పైపుల ద్వారానే తాగునీటిని అందించాలనే ది ప్రభుత్వ లక్షమని తెలిపారు.
మిషన్ భగీరథ పనులపై పుస్తకాలు ప్రచురించాలి. మిషన్ భగీరథ పనులను పూర్తి చేయు తేదీలను సూచిస్తూ గ్రామాల వారిగా, మండలాల వారిగా, జిల్లాల వారిగా పు స్తకాలను ముద్రించి సంబంధిత ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అందజేయాలన్నారు. పుస్తకాలలో ముద్రించిన షెడ్యుల్ ప్రకారం వారం వారం మండల స్థాయి సమీక్ష సమావేశాలలో, 15 రోజులకు ఒకసారి జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశంలో, నెలకు ఒకసారి మంత్రి సమీక్ష సమావేశంలో పనుల ప్రగతిని సమీక్షించి లోటుపాట్లను తెలుసుకుంటారని తెలిపారు.

ఇండ్లపై నుంచి వెళ్లే విద్యుత్ లైన్లను మార్చాలి
జిల్లాలో ఇండ్లపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను వెంటనే పక్కకు మార్చాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇండ్లపై ఉన్న లైన్లు మార్చుటకు 30 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కరీంనగర్ టౌన్‌లోనే 20 కోట్ల ఖర్చు చేసి హైటెన్షన్ లైన్లను పక్కకు మార్చామని తెలిపారు. గ్రామాలలో నడిరోడ్లపై ఉన్న కరెంటు స్థంబాలను పక్కకు మార్చాలని సూచించారు. రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మార్లను పక్కకు మార్చాలని వాటికి ఫినిషింగ్ చేయించాలని సూచించారు. ఎన్నడు లేని విధంగా జిల్లా సబ్ స్టేషన్లు మంజూరు చేశామని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్దరించి గ్రామాలను సస్యశ్యామలం చేస్తున్నామని తెలిపారు.
గ్రామాల నుండి మండలాలకు డబుల్ రోడ్లు, మండలాల నుంచి జిల్లాలకు నాలుగు వరుసల రోడ్లు మంజూరు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. నాలుగవ విడతలో కూడా నాటిన మొక్కలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. సమీక్ష సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతరావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, శాసన మండలి చీఫ్‌విప్ పాటూరి సుధాకర్, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్లు సర్ఫరాజ్ అహ్మద్, కృష్ణభాస్కర్, శ్రీ దేవ సేన, శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్‌రావు, హుస్నాబాద్, మంథని, చొప్పదండి, మానకొండూర్, కోరుట్ల శాసన సభ్యులు ఒడితెల సతీష్ కుమార్, బొడిగె శోభ, పుట్ట మధు, రసమయి బాలకిషన్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఆర్థిక శాఖ చైర్మన్ రాజేశంగౌడ్, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, మైనారిటీ కార్పోరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.