ప్రజావాణికి తగ్గిన స్పందన

The popularity held in the collectorate has reduced

మన తెంగాణ / సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆదరణ తగ్గింది. కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసి యాస్మిన్‌భాష, డిఆర్‌ఒ శ్యాంప్రసాద్‌లాల్ సహ జిల్లా అధికారులు పాల్గొన్న ప్రజావాణిలో కేవలం 65 మంది మాత్రమే ఆర్జీలను సమర్పించారు. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి వల్ల ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రజావాణికి హజరు కాలేదు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో హరితహారాన్ని జయప్రదం చేయాలన్నారు. అధికారులు సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వ అవసరాలకు తగిన భూమిని సేకరించేందుకు సిద్ధ్దంగా ఉండాలన్నారు. కోర్టు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు విఐపిలకు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారం పట్ల శ్రద్ధ చూపాలన్నారు.

Comments

comments