ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి పనులు

మన తెలంగాణ/తిర్యాణి : ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం అలాగే ప్రజల కోరిక మేరకు పలు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని ఆసిఫాబాద్ ఎంఎల్‌ఎ కోవలక్ష్మి, ఎంఎల్‌సి పురాణం సతీష్ అన్నారు. ఆదివారం మండలంలోని కన్నెపల్లి, తిర్యాణి పంచాయతీలలో రూ. 5కోట్ల 12లక్షల 48వేల సిఆర్‌ఎస్ నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు  మారుమూల గ్రామాల అభివృద్ధిపై ఏనాడూ దృష్టి సారించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక […]

మన తెలంగాణ/తిర్యాణి : ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం అలాగే ప్రజల కోరిక మేరకు పలు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని ఆసిఫాబాద్ ఎంఎల్‌ఎ కోవలక్ష్మి, ఎంఎల్‌సి పురాణం సతీష్ అన్నారు. ఆదివారం మండలంలోని కన్నెపల్లి, తిర్యాణి పంచాయతీలలో రూ. 5కోట్ల 12లక్షల 48వేల సిఆర్‌ఎస్ నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు  మారుమూల గ్రామాల అభివృద్ధిపై ఏనాడూ దృష్టి సారించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలోనే పలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఆదివాసీలపై కెసిఆర్‌కు ఎనలేని గౌరవం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదివాసీ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌పై భీం విగ్రహాన్ని కావాలనే ఆంధ్రాపాలకులు ఏర్పాటు చేయలేదన్నారు. తమ ప్రాంత మన్యం వీరుడి చరిత్ర కనుమరుగయ్యే అవకాశం ఉందనే పట్టించుకోలేదన్నారు. జోడేఘాట్‌ను చరిత్రలోనే నిలిచేలా దేశం గర్వించేలా అభివృద్ధి చేశామన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఆసిఫాబాద్ డివిజన్‌లో అదనంగా 125గ్రామ పంచాయతీలుగా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివాసీ నిరుద్యోగ గిరిజనులకు ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా సిఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. పీసా చట్టం ప్రకారం ఆదివాసులకు అన్ని రంగాల్లోకి ముందుండేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో తిర్యాణి ఎంపిపి లక్ష్మి, వైఎస్ ఎంపిపి మెస్రం గణేష్, ఎంఈఓ ఎన్ శంకర్, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, రాయిసెంటర్ జిల్లా సర్మెడి కోట్నాక కిషన్, ఆదివాసి అడ్వకేట్ గోపితోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ , గిరిజన సంఘాల నాయకులు, తిర్యాణి , రెబ్బెన, మండలాల టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: