ప్రజలకు అందుబాటులో ప్రజావైద్యం

అలంపూర్ ఆసుపత్రిలో సర్జరీలు ఇన్‌చార్జి కలెక్టర్ రోనాల్డ్ రొస్ మనతెలంగాణ/అలంపూర్: ప్రజలకు అందుబాటులో ప్రజా వైద్యం  అందిం చేందుకు సౌకర్యాలు కల్పిస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ రోనాల్డ్ రొస్ స్పష్టం చేశారు. శుక్రవారం అలంపూర్‌లోని టి.జి.వెంకటేశ్ ప్రభుత్వ ప్రజావైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేరని వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన  ఇన్‌చార్జి కలెక్టర్ రోనాల్డ్ రొస్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సదుపాయాలు, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యశాలలో సుఖప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయని సిజేరియన్ శస్త్ర చికిత్సలు జరిగేలా […]

అలంపూర్ ఆసుపత్రిలో సర్జరీలు
ఇన్‌చార్జి కలెక్టర్ రోనాల్డ్ రొస్

మనతెలంగాణ/అలంపూర్: ప్రజలకు అందుబాటులో ప్రజా వైద్యం  అందిం చేందుకు సౌకర్యాలు కల్పిస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ రోనాల్డ్ రొస్ స్పష్టం చేశారు. శుక్రవారం అలంపూర్‌లోని టి.జి.వెంకటేశ్ ప్రభుత్వ ప్రజావైద్యశాలలో వైద్యులు అందుబాటులో లేరని వస్తున్న ఫిర్యాదులపై స్పందించిన  ఇన్‌చార్జి కలెక్టర్ రోనాల్డ్ రొస్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సదుపాయాలు, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యశాలలో సుఖప్రసవాలు మాత్రమే జరుగుతున్నాయని సిజేరియన్ శస్త్ర చికిత్సలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిజేరియన్ శస్త్ర చికిత్సలకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోందన్నారు. ఈ సమస్యను నివారించేందుకు డిఎం అండ్ హెచ్‌ఒ, గైనకాలజిస్టు  డాక్టర్ సునీత వారంలో మూడు రోజులు పాటు గర్భిణీలకు శస్త్ర చికిత్సలు అందిస్తారని ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో పూర్తి సౌకర్యాలు కల్పిస్తుట్లు ఆయన వివరించారు. శవ పరీక్షల గదిలో విద్యుత్ సౌకర్యం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. శవపరీక్ష గదికి విద్యుత్  సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ తాలూకా ఇన్‌చార్జి మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ వి ఎం అబ్రహాం, అలంపూర్ మార్కెట్ యార్డు ఛైర్మన్ పటేల్ విష్ణువర్ధన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు ఇస్మాయిల్, నారాయణరెడ్డి, వైద్య  సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: