ప్రగతి భవన్‌లో ఘనంగా దసరా వేడుకలు

CM KCR

 

వాహనపూజ, ఆయుధ పూజ చేసిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతిభవన్‌లో విజయ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వాహనపూజ, ఆయుధ పూజ చేశారు. ప్రగతి భవన్‌లో నివాసంలోని నల్లపోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా సిఎం పూజలు నిర్వహించారు. ఆయుధ పూజ అనంతరం సిఎం కెసిఆర్ పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమంలో కెసిఆర్ సతీమని శోభా చంద్రశేఖర్‌రావు, కుమారుడు కెటిఆర్, కోడలు శైలిమ, మనమడు హిమాన్షు, కూతురు కవిత, అల్లుడు అనిల్‌కుమార్‌తో పాటు మనవళ్లు, మనవరాండ్లు, ఇతర కుటుంబ సభ్యులు, కార్యాలయం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

CM KCR Celebrates Dussehra at Pragathi Bhavan

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రగతి భవన్‌లో ఘనంగా దసరా వేడుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.