ప్రగతి నివేదన సభకు…బయల్దేరిన 2 వేల ట్రాక్టర్లు

Tractors come to Pragathi Nivedana sabha from khammam

ఖమ్మం : సెప్టెంబర్ 2వ తారీఖున హైదరాబాద్ దగ్గరలోని కొంగరకలాన్ లో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభకు ఖమ్మం నుంచి 2 వేల ట్రాక్టర్లు బయలుదేరాయి. శుక్రవారం మధ్యాహ్నం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంఎల్ఎ పువ్వాడ అజయ్ కుమార్ కలిసి 2000 ట్రాక్టర్లను పార్టీ జెండా ఊపి, స్వయంగా నడిపి ప్రారంభించారు. 2000 ట్రాక్టర్లలో సుమారు 10,000 మంది రైతులు, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం సాయంత్రం కొంగరకలాన్ సభా వేదిక దగ్గరకు చేరుకుంటారని ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Comments

comments