ప్రకృతి వ్యవసాయంతోనే పరిష్కారం : వెంకయ్య

VENKAIAH

హైదరాబాద్ : ప్రకృతి వ్యవసాయంతోనే దేశం సంక్షోభం నుంచి బయటపడుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ చిన్న జీయర్‌స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రసాయన అవశేషాల్లేని సురక్షిత ఆహారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామి, సీనియర్ ఐఎఎస్ అధికారి విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments