ప్చ్… !!! డిగ్రీ విద్య

కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపని విద్యార్థులు భారీగా మిగిలిన సీట్లు  ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, కోర్సుల్లో మార్పులు చేయకపోవడం వెరసి డిగ్రీ విద్య ఓ మిద్యగా మారింది. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందడా నికి విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన “దోస్త్ ” వెబ్‌సైట్ ద్వారా ప్రవే శాలు జరుగుతున్నాయి. మే నెల మొదటి వారంలో మొదలైన ప్రక్రియ జూలై ఏడు శనివారంతో ముగిసింది. అయినా ఆశించిన మేరకు […]

కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపని విద్యార్థులు
భారీగా మిగిలిన సీట్లు 

ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, కోర్సుల్లో మార్పులు చేయకపోవడం వెరసి డిగ్రీ విద్య ఓ మిద్యగా మారింది. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందడా నికి విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన “దోస్త్ ” వెబ్‌సైట్ ద్వారా ప్రవే శాలు జరుగుతున్నాయి. మే నెల మొదటి వారంలో మొదలైన ప్రక్రియ జూలై ఏడు శనివారంతో ముగిసింది. అయినా ఆశించిన మేరకు సీట్లు భర్తీ కాలేదు.

మన తెలంగాణ/ ఖమ్మం:  కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద 81 కళాశాలలు ఉన్నాయి. బిఏ, బికాం, బిబిఎం, బిఎస్సిలలో 32వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే నాలుగు దఫాలు ప్రవేశాలు ముగిశాయి. కేవలం 11,850 మంది మాత్రమే ఆయా కోర్సుల్లో చేరారు. ఇంకా 20,150 సీట్లు మిగిలాయి.

కళాశాలల్లో ప్రవేశాలు శూన్యం: గత నాలుగేళ్ల నుంచి ప్రవేశాలు తగ్గుముఖం పడుతున్నాయి. దోస్త్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు దోస్త్‌పై సరైన అవగాహన లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు కళాశాలల యాజమాన్యాలు వారి కళాశాలల్లో ప్రవేశాలు పొందేలా చేశారు. కానీ అభ్యర్థులు వాటిల్లో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. నాలుగు దశల ప్రవేశాలు ముగిసే సరికి 15 కళాశాలల్లో ఒక్కరు చేరలేదు. ఇవి మూతపడడం ఖాయంగా కన్పిస్తుంది.
ఆ నిబంధనలు అమలులోకి వస్తే ః తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన 25 సీట్ల నిబంధనలు అమలులోకి వస్తే జిల్లా పరిధిలోని 15 కళాశాలలు మూతపడతాయి. ఈ విద్యా సంవత్సరంలో ఆ కళాశాలల్లో ప్రవేశాలు లేవు. వీటిల్లో చివరికి ఒకరిద్దరు చేరిన వారిని ఇతర కళాశాలలకు బదిలీ చేస్తారు. ప్రతి కళాశాలల్లో 25 శాతం మంది ఉంటేనే నిర్వహణకు అనుమతి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అమలులోకి వస్తే సగానికి సగం కళాశాలలు మూసివేత దిశగా వెళ్తాయని అధికారులు చెబుతున్నారు.

Related Stories: