పోలీస్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్యాయత్నం…

అమరావతి: భార్య ఆత్మహత్య కేసు విషయమై పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన విషాద సంఘటన ఎపిలోని విజయవాడలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే… విజయవాడలో నివాసముండే నాగరాజు భార్య నాగమణి కానిస్టేబుల్. అయితే, ఆరు నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి నుంచి భార్య ఆత్మహత్య కేసులో ఓ కానిస్టేబుల్ తనను వేధిస్తున్నాడని బాధితుడు డిజిపికి సూసైడ్ నోట్ రాయడంతో పాటు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కేసు విచారణ పేరుతో తనను స్టేషన్ కు పిలిపించి […]

అమరావతి: భార్య ఆత్మహత్య కేసు విషయమై పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన విషాద సంఘటన ఎపిలోని విజయవాడలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే… విజయవాడలో నివాసముండే నాగరాజు భార్య నాగమణి కానిస్టేబుల్. అయితే, ఆరు నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటి నుంచి భార్య ఆత్మహత్య కేసులో ఓ కానిస్టేబుల్ తనను వేధిస్తున్నాడని బాధితుడు డిజిపికి సూసైడ్ నోట్ రాయడంతో పాటు విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కేసు విచారణ పేరుతో తనను స్టేషన్ కు పిలిపించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నాగరాజు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

comments

Related Stories: