పోలీస్ పాత్రలో నాని

Nani

హీరో నాని సినిమా సినిమాకు సబ్జెక్ట్ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటాడు. ఇటీవల వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా తప్ప మరే చిత్రం పెద్దగా నిరాశపరచలేదు. ప్రస్తుతం ‘దేవదాస్’ సినిమాను పూర్తి చేసిన నాని తన నెక్స్ మూవీ ‘జెర్సీ’ను త్వరలో ప్రారంభిస్తాడు. ఆతర్వాత మైత్రీ మూవీస్ కోసం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు. ఈ సినిమా లైన్, కథ ఇంకా తెలియదు కానీ ఇందులో నాని పోలీస్‌గా కనిపిస్తాడని తెలిసింది. అయితే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాబట్టి మిగిలిన హీరోలలాగా నాని యాంగ్రీ పోలీస్‌గానో, స్ట్రిక్ట్ పోలీస్‌గానో కనిపించకపోవచ్చు. ఈ దర్శకుడు అన్నీ డిఫరెంట్ స్టోరీలు రాసుకుంటాడు కాబట్టి నానీని విభిన్నమైన పోలీస్‌గా చూపిస్తాడు. అంటే నాని పాత్రలో కొత్తదనం ఉంటుందన్న మాట. ఇక స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ‘జెర్సీ’ చేయబోతున్న నాని ప్రస్తుతం మరికొన్ని స్క్రిప్టులు ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది.

Comments

comments