పోలీస్టేషన్ లో మహిళ ఆత్మహత్య యత్నం

Women Commite Sucide

నల్లగొండ: మహిళ పోలీస్ స్టేషన్ లో  ఆత్మహత్యకు యత్నించిన ఘటన జిల్లాలోని మిర్యాలగూడలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన ప్రకారం .. వినాయక విగ్రహాల తయారీ, పెట్టుబడి విషయంలో, విగ్రహాల తయారీ దారులకు మరియు పెట్టుబడి దారులకు మధ్య వివాదం జరిగింది. ఈ విషయమై బాధిత మహిళ  బట్టు సునిత సోమవిరం నాడు పట్టణ పోలీస్ స్టేషర్ లో ఫిర్యాదు చేసింది. కాగా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ పోలీస్ స్టేషన్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన పోలీసులు బాధితురాలుని చికిత్స నిమిత్తం  స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Comments

comments