పోలీసు పహారా…

రాబోయే రోజులు పోలీసు శాఖకు ఎంతో కీలకం వరుసల పండుగలు, నగరంలో వేడెక్కిన ఎన్నికల హడావిడి కంటికి కునుకు కూడా కరువవక తప్పదు మన తెలంగాణ/సిటిబ్యూరో ః ఇక కాకీల కంటికి కునుకు కరువయి నట్లే రాబోయే రోజులు పోలీసుశాఖకు సవాలుగా మారనున్నాయి. ఓ వైపు పండుగల హడావిడి మరో వైపు ఎన్నికల వాతావరనం నగరంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపద్యంలో నగరం నలుమూలలో రోజు ఎదో హడావిడి ఉంటూనే ఉంది. పెద్ద సంఖ్యలో జనసమీకరణలు జరుగుతూనే […]

రాబోయే రోజులు పోలీసు శాఖకు ఎంతో కీలకం
వరుసల పండుగలు, నగరంలో వేడెక్కిన ఎన్నికల హడావిడి
కంటికి కునుకు కూడా కరువవక తప్పదు

మన తెలంగాణ/సిటిబ్యూరో ః ఇక కాకీల కంటికి కునుకు కరువయి నట్లే రాబోయే రోజులు పోలీసుశాఖకు సవాలుగా మారనున్నాయి. ఓ వైపు పండుగల హడావిడి మరో వైపు ఎన్నికల వాతావరనం నగరంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపద్యంలో నగరం నలుమూలలో రోజు ఎదో హడావిడి ఉంటూనే ఉంది. పెద్ద సంఖ్యలో జనసమీకరణలు జరుగుతూనే ఉంటాయి. ఈ జనసమీకరణాలలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు అందించాల్సిన భాద్యత పోలీసులదే. అన్ని కలిసికట్టుగా దాడి చేసినట్లు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వచ్చిపడ్డాయి. ఇప్పటికే నగర పరిధిలోని మూడు కమిషనరేట్‌ల పోలీస్‌బాస్‌లు వినాయక చవితి, మొహర్రం ఏర్పాట్లలో మునిగి ఉన్నారు. ఇవి ముగిసేలోగా దుర్గానవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. అవీ ముగిసే సమయానికి నగరంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంటుంది. ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసే సభలు సమావేశాలు. టికెట్ పొందినవారు ప్రచార సభలు చేస్తే రానివారు నిరసనల ర్యాలీలు నిర్వహిస్తారు. ఎవరు ఏ పనిచేసినా వాటిని నివారించాల్సిన భాద్యత పోలీసులదే. ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న పరిస్ధితుల నేపద్యంలో ముగ్గురు పోలీసు భాస్‌లు తమ సిబ్బందికి స్టాండ్ డ్యూటి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎవరికి కూడా సెలవులు లభించవు. సెలవులో ఉన్న వారు కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. నగర పరిధిలోని సిబ్బందితో పాటు అదనపు బలగాలు కూడా అవసరమవుతాయి. గణేష్ బందోబస్తుకు ఇప్పటికే అదనపు బలగాలను నగరానికి రప్పించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాజకీయ హడావిడి నెలకొన్న నేపద్యంలో ఆ బలగాలు సరిపోయే పరిస్థితులు లేవని ఉన్నతాదికారుల యోచన. ఉన్న సిబ్బందికి విశ్రాంతి లేకుంగా 24 గంటలు డ్యూటి వేసినా సిబ్బంది సరిపోయే పరిస్తితి లేదని పలువురి అధికారుల అభిప్రాయం.
ఏకకాలంలో గణేష్, మొహర్రం బందోబస్తులతోపాటు రాజకీయ నాయకుల కదలికలకు, పార్టీల సభలు సమావేశాలకు బందోబస్తు నిర్వహించేందుకు ప్రస్తుత సిబంది సరిపోరని అదికారుల ఆలోచన. ఏది ఏమైన నగరంలో చీమచిటుక్కుమన్నా క్షణాల వ్యవధిలో స్పదించాల్సిన భాద్యత పోలీసులకు ఉంది. ఇలాంటి కీలక సమయంలో పోలీసులకు కంటికి కునుకు కూడా ఉండదంలే ఆశ్చర్యం లేదు.

Comments

comments