పోలీసులు రౌండప్.. పిస్తోల్‌తో కాల్చుకున్న స్మగ్లర్

జైపూర్: డ్రగ్స్ అక్రమరవాణా చేస్తున్నస్మగ్లర్ తనను తాను కాల్చుకొని మృతిచెందిన ఘటన రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో శుక్రవారం జరిగింది. ఖర్టారామ్, భజన్‌లాల్ నార్కోటిక్ డ్రగ్స్‌ను అక్రమరవాణా చేస్తున్నసమయంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఖర్టారామ్ పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు వెంబడించి ఓ కొండ సమీపంలో అతడిని చుట్టుముట్టారు. దీంతో ఖర్టారామ్ పోలీసులపై కాల్పులు జరిపి తనను తాను గన్ తో కాల్చుకుని చనిపోయాడు. ఈ దాడిలో పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదని […]

జైపూర్: డ్రగ్స్ అక్రమరవాణా చేస్తున్నస్మగ్లర్ తనను తాను కాల్చుకొని మృతిచెందిన ఘటన రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో శుక్రవారం జరిగింది. ఖర్టారామ్, భజన్‌లాల్ నార్కోటిక్ డ్రగ్స్‌ను అక్రమరవాణా చేస్తున్నసమయంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఖర్టారామ్ పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు వెంబడించి ఓ కొండ సమీపంలో అతడిని చుట్టుముట్టారు. దీంతో ఖర్టారామ్ పోలీసులపై కాల్పులు జరిపి తనను తాను గన్ తో కాల్చుకుని చనిపోయాడు. ఈ దాడిలో పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించామని ఎస్ పి పేర్కొన్నారు.

Related Stories: