పోలీసులను ఆశ్రయించిన పవన్ హీరోయిన్..!

Pawan Kalyan’s heroine Preeti Jhangiani lodges a police complaint

ముంబయి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘తమ్ముడు’ సినిమాల్లో హీరోయిన్‌ గా నటించిన ప్రీతీ జంగానియా గుర్తుంది కదూ. వివాహం తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రీతీ ప్రస్తుతం ముంబయిలో నివాసముంటుంది. చాలా కాలంగా బయట కనిపించని ఆమె తాజాగా మీడియా ముందుకు వచ్చింది. తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకున్న పక్క అపార్ట్‌మెంట్‌లో నివాసముండే వ్యక్తిపై ప్రీతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ పెద్దాయన తన కుమారుడిపై చేయి చేసుకోవటంతో పాటు అపార్ట్‌మెంట్‌ నుంచి బయటకు గెంటివేశారంటూ ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  దీంతో పోలీసులు ఇరు కుంటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి, సర్ది చెప్పినట్లు సమాచారం.