పోరాటాలకు ఆదిలాబాద్ ప్రసిద్ధి

చట్టాల ద్వారా వచ్చిన హక్కులను అడుగుతున్నారు ఆదివాసీలకు అండగా తెలంగాణ జన సమితి పోరు గర్జన సభలో ప్రొఫెసర్ కోదండ రాం మన తెలంగాణ/ఖానాపూర్ : ఉద్యామాలకు ,పోరాటాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి అని ఆదిలాబాద్ అంటే ఆదివాసీల జిల్లా ప్రభుత్వాలపై పోరాటాలు ఆదివాసీలకు కొత్త కాదని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. ఖానాపూర్‌లో గురువారం ఆదివాసీ పోరు గర్జన సభ జరిగింది. ఈ సభకు పి. భీమ్‌రావు అధ్యక్షత […]

చట్టాల ద్వారా వచ్చిన హక్కులను అడుగుతున్నారు
ఆదివాసీలకు అండగా తెలంగాణ జన సమితి
పోరు గర్జన సభలో ప్రొఫెసర్ కోదండ రాం

మన తెలంగాణ/ఖానాపూర్ : ఉద్యామాలకు ,పోరాటాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి అని ఆదిలాబాద్ అంటే ఆదివాసీల జిల్లా ప్రభుత్వాలపై పోరాటాలు ఆదివాసీలకు కొత్త కాదని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండ రాం అన్నారు. ఖానాపూర్‌లో గురువారం ఆదివాసీ పోరు గర్జన సభ జరిగింది. ఈ సభకు పి. భీమ్‌రావు అధ్యక్షత వహించగా ప్రొఫెసర్ కోదండ రామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోదండరాం రాగానే  ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. స్థానిక విశ్రాంతి భవనం నుండి బహిరంగ సభ జరిగే ఊరెగింపుగా వచ్చారు. ఊరెగింపులో అంబేద్కర్, తెలంగాణ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు. ఊరేగింపులో ఆదివాసీల నృత్యాలతో,సంప్రదాలయాతో కొనసాగించారు. ఈ సందర్బంగా పోరుగర్జన సభను ఉద్దెశించి తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఆదివాసీలు అడవిని హక్కుగా చేర్చుకుంటే ప్రభుత్వాలు ఆదివాసీల భూములను హరితహారం పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆదివాసీలు పోడు భూములను సాగు చేసుకుంటే పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఆ భూములు అటవీ భూములని లాక్కుంటున్నారని  కోమరంభీం స్ఫూర్తిగా పోడు భూముల కోసం ఆదివాసీలు ఉద్యమం చేస్తున్నామన్నారు. అటవీ భూములను అటవీ శాఖ వారు స్వాధీనం చేసుకుంటు అదివాసీలకు భూమి లేకుండా చేస్తున్నారని ఆదివాసీల అభివృద్ధి ప్రభుత్వాలు పని చేయాలని కానీ గుంజుకోవడం ఎంటన్నారు. ఆదివాసీల అభివృద్ధికి ఇంగ్లండ్ దేశస్తుడు ఇక్కడికి వచ్చి ఆదివాసీలతో జీవనం గడుపుతూ వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆదివాసీల అభివృద్ది అప్పటి ప్రభుత్వాలు ఐటిడిఎలు ఏర్పాటు చేయగా ఉన్నత అధికారులు ఆదివాసీ గుడాల్లో ఉంటూ వారి అభివృద్ధి చేశారని ఆయన తెలిపారు. ఆదివాసీలు అంటే అమాయకులు అని వారు పండించిన పంటలను చుట్టికిపావుచేరు క్రింద అమ్ముకొని అంగడి రోజు వారి కావాల్సిన ఆహార వస్తువుల కొనించేవారన్నారు. ఆదివాసీల కోసం ప్రభుత్వాలు ఏర్పటు చేసిన హక్కులు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయన్నారు. ఆదివాసీలు చట్టాల ద్వారా వచ్చిన హక్కులను అడుగుతున్నారన్నారు. రెవెన్యూ శాఖ పారదర్శకంగా చట్టాన్ని అమలు చేస్తే ఆదివాసీల భూములను ఎవరు లాక్కొరని చట్టం ద్వారా వచ్చిన వాటాను ప్రభుత్వాలు ఆదివాసీలను అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. ఆదివాసీ భూములను లాక్కోవద్దని ,టైగర్ జోన్ పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అమలు చేయాలన్నారు. ఆదివాసీలపై ప్రభుత్వం చర్చల చేస్తేనే సమస్య ల పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. ఆదివాసీలకు భూమిలేదు, ఉద్యో గం లేదు, పట్టాలు లేదు అందుకే ఆదివాసీలు ప్రభుత్వం పై ఉద్యమ బాట చేపట్టారని వారికి అండగా ప్రోఫెసర్ కోదండరాం ఎప్పుడు తోడుగా ఉంటానన్నా రు. ప్రజల గురించి జన సమితి ఏర్పాటు అయిందని అన్ని సమస్యల పరిష్కారానికి జన సమితి ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. నిర్మల్ జిల్లాలో వ్యవసా యం భారంగా మారిందని ప్రభుత్వాలు,పాలకులు సంపాదన పై దృష్టి పెట్టార ని ప్రజల అభివృద్ది పై దృష్టి పెట్టడం లేదన్నారు. దీని పై చర్చ జరుపాలన్నారు. రాజకీయాల మార్పు కోసమే జన సమితి పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో ఆదిలాబాద్ ఇంచార్జీ దుర్గం రాజేశ్వర్, నిర్మల్ జిల్లా ఇంచార్జీ గోపాల్‌శర్మ, నాయకులు రవీందర్, కిరన్‌రెడ్డి, విజయ్‌కుమార్, రాధ బాయ్, లక్ష్మీ, శ్యాం సుందర్‌రెడ్డి,శ్రీనివాస్, వినోద్, బాపన్న, రవీందర్ ఆదివాసీలు పాల్గొన్నారు.

Related Stories: