పోతిరెడ్డి ద్వారా నీటి విడుదల వెంటనే ఆపండి

  ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా బోర్డు తాఖీదు మన తెలంగాణ / హైదరాబాద్: శ్రీశైలంలో చేరిన కృష్ణా జలాలను ద్వారా తరలించడాన్ని తక్షణం ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించుకోవాల్సిన కృష్ణా జలాల కోటా పరిమితి ఇప్పటికే దాటిపోయింద ని, అందువల్ల వెంటనే నీటిని తీసుకోవడాన్ని ఆపివేయాలని బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్‌కు రాసిన లేఖలో […]

 

ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా బోర్డు తాఖీదు

మన తెలంగాణ / హైదరాబాద్: శ్రీశైలంలో చేరిన కృష్ణా జలాలను ద్వారా తరలించడాన్ని తక్షణం ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలించుకోవాల్సిన కృష్ణా జలాల కోటా పరిమితి ఇప్పటికే దాటిపోయింద ని, అందువల్ల వెంటనే నీటిని తీసుకోవడాన్ని ఆపివేయాలని బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్‌కు రాసిన లేఖలో సంబంధిత అధికారులకు ఈ మేరకు తక్షణం ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. నిర్దిష్ట పరిమితిని నిర్ణయించినప్పటికీ ఆ కోటా దాటిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ నీటిని వాడుకుంటూనే ఉందని, దీనికి వెంటనే స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ, హంద్రీ నీవా ఎత్తిపోతల పథకాలకు కూడా ఇచ్చిన కోటా పరిమితి దాటిపోయిందని, అయినా నీటిని వాడుకుంటూనే ఉందని పరమేశం ఆ లేఖలో పేర్కొన్నారు.

52.50 టిఎంసిలకు తెలంగాణ ఇండెంట్ :
ప్రస్తుత ‘వాటర్ ఇయర్’లో నవంబరు వరకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 52.50 టిఎంసిల నీటిని వాడుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని ఆ లేఖలో గుర్తుచేసిన పరమేశం వెంటనే ఆంధ్రప్రదేశ్ కూడా తన అవసరాలకు తగిన ప్రతిపాదనలను పంపాల్సిందిగా కోరారు. ఇప్పటికింకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ఇండెంట్ అందలేదని గుర్తుచేశారు. తెలంగాణ తన అవసరాలను ఇండెంట్ రూపంలో పంపినట్లుగానే ఆంధ్రప్రదేశ్ కూడా వీలైనంత త్వరగా పంపాలని, తద్వారా రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై స్పష్టత రావాలని పేర్కొన్నారు. ఇది జరగనంత వరకూ ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం ఫిర్యాదు చేస్తూనే ఉంటుందని, అందుకు ఆస్కారం ఇవ్వవద్దని సూచించారు.

Comments

comments