‘పొరుగు దేశాలతో సత్సంబంధాల కోసం కృషి’

ఇస్లామాబాద్: పాకిస్తాన్ తన పొరుగు దేశాలన్నిటితోను సత్సంబంధాలు కలిగి ఉండ డం కోసం కృషి చేస్తుందని, వాటితో సంబంధాలు మామూలు స్థాయికి తీసు కురావడానికి చర్చలు జరుపుతుందని, ఎందుకంటే ఇది లేకుండా దేశంలో శాంతి నెలకొల్పడం సాధ్యం కాదని ఆ దేశ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశ 22వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకరోజు తర్వాత ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి దాదాపు గంటసేపు తొలిసారి ప్రసంగించిన ఇమాన్ ఆర్థిక రంగంలో తన ప్రభు […]

ఇస్లామాబాద్: పాకిస్తాన్ తన పొరుగు దేశాలన్నిటితోను సత్సంబంధాలు కలిగి ఉండ డం కోసం కృషి చేస్తుందని, వాటితో సంబంధాలు మామూలు స్థాయికి తీసు కురావడానికి చర్చలు జరుపుతుందని, ఎందుకంటే ఇది లేకుండా దేశంలో శాంతి నెలకొల్పడం సాధ్యం కాదని ఆ దేశ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశ 22వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒకరోజు తర్వాత ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి దాదాపు గంటసేపు తొలిసారి ప్రసంగించిన ఇమాన్ ఆర్థిక రంగంలో తన ప్రభు త్వ ప్రాధాన్యతలను వివరించడంతో పాటు ఎదుగుదల ఆగిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేయడం కోసం పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ ప్రస్తు తరుణ భారం రూ.28 లక్షల కోట్లకు చేరుకుందని, దీనికి నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని గత పిఎంఎల్‌ఎన్ ప్రభుత్వమే కారణమని ఆయన అంటూ గత పదేళ్లలో అప్పుల పాలయినట్లుగా పాకిస్తాన్ గతంలో ఎన్నడూ లేదన్నారు. పాకిస్తాన్ విదేశీ విధానం గురించి మాట్లాడుతూ, అన్ని పొరుగు దేశాలతో అత్యుత్తమ సంబంధాలును కలిగి ఉంటామని చెప్పారు. అన్ని పొరుగు దేశాలతోను తాను మాట్లాడానని అంటూ, దేవుడి దయతో అన్ని పొరుగు దేశాలతోను సంబంధాలను మెరుగు పర్చుకుంటామని స్పష్టంచేశారు.

‘పొరుగు దేశాలతో శాంతి లేకుండా దేశంలో శాంతిని తీసుకు రాలేం’ అని ఆయన అన్నారు. కాగా జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన తర్వాత దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇమ్రా న్ భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి పాక్ సిద్ధగా ఉందని, ఇరు దేశాల నేతలు ప్రధాన సమ స్య అయిన కాశ్మీర్‌ను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పడం తెలిసిందే. కాగా ఆదివారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఇమాన్ ఖాన్ ‘నయా పాకిస్తాన్’ను రూపొందిస్తానని హామీ ఇస్తూ, విదేశాల్లో దాచిన ప్రజల సొమ్మును వాపసు తీసుకు రావడానికి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చా రు. అంతేకాదు, రుణాలు తీసుకోవడానికి బదులు పొదు పు చర్యలు చేపట్టడం, పన్ను సంస్కరణలు తీసుకు రావడవతో పాటుగా అవినీతిని అంతమొందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు నింపుతామని అన్నారు. అంతేకాదు, న్యాయవ్యవస్థను సంస్కరిస్తామని, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తీసుకు వస్తామని, సివిల్ సర్వీస్‌లో సంస్కరణలు చేపడతామని, అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నీటి సంక్షోభాన్ని అంతమొందించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తామని కూడా ఇమ్రాన్ ఖాన్ హామీ ఇచ్చారు.

Comments

comments