పొదుపు ఆలోచన తక్కువే…

మూడింట ఒక వంతు మాత్రమే పొదుపు చేస్తున్నారు వృద్ధాప్యంపైకన్నా ఈ రోజు ఎంజాయ్‌మెంట్‌కే మొగ్గు ప్రపంచవ్యాప్తంగా కూడా అదే ధోరణి వృద్ధాప్య అవసరాలపై అవగాహనా రాహిత్యమే కారణం హెచ్‌ఎస్‌బిసి సర్వే వెల్లడి ముంబయి: భారత దేశంలో ప్రతి ముగ్గురిలో ఒక్కరు మాత్రమే తమ రిటైర్మెంట్ జీవితం కోసం రెగ్యులర్‌గా ఆదా చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా కూడా వర్కింగ్ ఏజ్ వారిలో కేవలం 33 శాతం మంది మాత్రమే తమ వృద్ధాప్య జీవితం కోసం కొంత మొత్తాన్ని పక్కన పెడుతున్నారని […]

మూడింట ఒక వంతు మాత్రమే పొదుపు చేస్తున్నారు
వృద్ధాప్యంపైకన్నా ఈ రోజు ఎంజాయ్‌మెంట్‌కే మొగ్గు
ప్రపంచవ్యాప్తంగా కూడా అదే ధోరణి
వృద్ధాప్య అవసరాలపై అవగాహనా రాహిత్యమే కారణం
హెచ్‌ఎస్‌బిసి సర్వే వెల్లడి

ముంబయి: భారత దేశంలో ప్రతి ముగ్గురిలో ఒక్కరు మాత్రమే తమ రిటైర్మెంట్ జీవితం కోసం రెగ్యులర్‌గా ఆదా చేస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా కూడా వర్కింగ్ ఏజ్ వారిలో కేవలం 33 శాతం మంది మాత్రమే తమ వృద్ధాప్య జీవితం కోసం కొంత మొత్తాన్ని పక్కన పెడుతున్నారని తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడయింది. రిటైర్మెంట్ జీవితంలో ఎంత మొత్తం అవసరమవుతుందనే విషయంలో అవగాహన లేకపోవడం, వృద్ధా ప్య జీవితంకన్నా కూడా తమ తక్షణ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటివి జనం ఆదా చేయకపోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని హెచ్‌ఎస్‌బిసి ‘ఫ్యూచర్ ఆఫ్ రిటైర్మెంట్: బ్రిడ్జింగ్ ది గ్యాప్’ పేరుతో నిర్వహించిన సర్వే నివేదిక పేర్కొంది. అదృష్టవశాత్తు చాలా మంది విషయంలో రిటైర్మెంట్ అనేది మన జీవితం చివరి దశతో ముడిపడిన స్వల్పకాలం ఎంతమాత్రం కాదని, అది ఒక వ్యక్తి జీవితంలో సుదీర్ఘమైన, ఫలవంతమైన భాగంగా ఉండవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే 65 ఏళ్ల వయసులో మన అవసరాలు 75 లేదా 85 ఏళ్ల వయసులో అవసరాలకు పూర్తి భిన్నంగాను, ఆర్థికంగా భిన్నమైన ప్రభావాన్ని కలిగి ఉండవచ్చని హెచ్‌ఎస్‌బిసి ఇండియా రిటైల్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజిమెంట్ విభాగం హెడ్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. హెచ్‌ఎస్‌బిసి తరఫున ఇప్సోస్ ఈ నివేదిక కోసం దాదాపు 16 దేశాల్లోని 16,000 మందిని ఆన్‌లైన్‌లో ప్రశ్నించింది. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, కెనడా, చైనా, మలేసియా, మెక్సికో, సింగపూర్, తైవాన్, ఫ్రాన్స్, ఫాంకాంగ్, భార త్, ఇండొనేసియా, టర్కీ, యుఎఇ, బ్రిటన్, అమెరికా ఈ దేశాల్లో ఉన్నాయి.

పని చేసే వయసులో ఉండే వారిలో కేవలం 19 శాతం మంది మాత్రమే తమ భవిష్యత్ నర్సింగ్, లేదా కేర్ హోమ్ అవసరాల కోసం ఆదా చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది, రిటైర్మెంట్‌లో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఇంటివద్ద తమ అవసరాలు చూసే విషయంలో దాదాపు సగం మంది (51 శాతం) అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఈ విషయంలో మాత్రం ముందు జాగ్రత్త పడకపోవడం గమనార్హమని ఆ నివేదిక పేర్కొంది. కాగా పని చేసే వయసులో ఉన్న వారిలో సగానికి పైగా (56 శాతం) ఆర్థికంగా ఏరోజుకా రోజు పద్ధతిలోనే జీవిస్తున్నారని, 53 శాతం మంది తమ స్వల్పకాలిక లక్షాల కోసమే ఆదా చేస్తున్నారని కూడా ఆ నివేదిక వెల్లడించింది. అంతేకాదు దాదాపు సగం మంది (45 శాతం) భవిష్యత్తు కోసం ఆదా చేయడంకన్నా కూడా ఈ రోజు ఎంజాయ్ చేయడం కోసమే ఖర్చు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఆనివేదిక స్పష్టం చేసింది. చాలా మంది తమ వృద్ధాప్య రోజులను రిటైర్మెంట్‌గా పరిగణించక పోవడమూ ఆదా చేయకపోవడానికి ప్రధాన కారణమని, పని చేసే వయసులో ఉండే వారిలో మూడిం ట రెండు వంతుల మంది(69 శాతం) మరికొంత కాలం ఉద్యోగంలో కొనసాగాలని అనుకొంటూ ఉండగా, మరో 54 శాతం కొత్త వ్యాపారమో, లేదా కొత్త వెంచర్‌నో ప్రారంభించాలని అనుకొంటూ ఉన్నారని నివేదిక వెల్లడించింది. రిటైర్మెంట్ వయసులో ఎంత మొత్త అవసరమో మీకు తెలుసా అన్న ప్రశ్నకు చాలా మంది తమ ఇంటి అవసరాలు లాంటి సాధారణమైన వాటి గురించే మాట్లాడడం గమనార్హమని,ప్రపంచవ్యాప్తంగా రిటైర్మెంట్ విషయంలో చాలా వరకు ఇదే అభిప్రాయం ఉండడం ఒక విధంగా సానుకూల విషయమని ఆ నివేదిక స్పష్టం చేసిం ది. అంతేకాదు, రిటైరయిన తర్వాత ‘నైన్ టు ఫైవ్’ పని గంటలనుంచి స్వేచ్ఛ పొందాలని, కొత్త హాబీలు, ఆసక్తు లు అలవర్చుకోవాలని, ఫిట్నెస్‌పట్ల దృష్టి పెట్టాలని సర్వే లో పాల్గొన్నవారిలో అత్యధికులు అభిప్రాయపడ్డం గమనార్హం.

Comments

comments

Related Stories: