పైసా ఖర్చు లేకుండా అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తాం

There was no hands to pay Rs one lakh

నాడు లక్షరూపాయలు ఇవ్వమన్న చేతులు రాలేదు
రాష్ట్రం ఏర్పడ్డాక పాలన మనదే అధికారం మనదే
జమ్మికుంట టూ కమలాపూర్ రూ.18 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తా
మడిపెల్లి గ్రామంలో 8కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/జమ్మికుంట: ఒకనాడు మనం మరువన్న పిల్లలమని ఎన్ని  అర్జీలు పెట్టుకున్న నాటి ఆంధ్ర పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని అభివృద్ది పనుల కోసం లక్ష రూపాయలు ఇవ్వమని అడిగితే చేతులు రాలేదని  కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక పాలన మనదే అధికారం మనదే అందుకే గ్రామీణ పల్లేల్లోకి వెలుగు వచ్చిందని రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం జమ్మికుంట,ఇల్లందకుంట మండలాల్లో మంత్రి ఈటల రాజేందర్ సూడిగాలి పర్యాటన చేశారు. మడిపెల్లి  గ్రామంలో  8 కోట్ల రూపాయల తో నిర్మించిన మడిపెల్లి బిడ్జి, సిసి రోడ్ల ను మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు అంకుషాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్బంగా మడిపెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ నాడు మడిపెల్లి గ్రామంలో ఏ వాడకు పోయిన దుబ్బ గుంతలు పడ్డ రోడ్డుతో అనేక ఇబ్బందులు పడ్డామని ఉద్యమ సమయంలో అభివృద్ది జరుగకున్న తమ బిడ్డలా తనను ప్రతి సారి గెలిపించారని మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని కోట్లయిన వెనడుగు వేయకుండ ఇప్పటి వరకు ఒక్క గ్రామానికి 8 కోట్ల రూపాయలు మంజూరు చేశామని అన్నారు.ఈడబ్బులతో 80శాతం గ్రామంలో సిసి రోడ్లు పూర్తి చేశామని మరేన్ని కోట్లాయిన ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని నిరటికాడు మడి ఎండకోట్టుకోడని అభివృద్దిని నాకు వదలేయండి గ్రామంలో అందరు ఐఖ్యంగా కలిసి ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.ఇప్పటికే అభివృద్దిలో మడిపెల్లి ముందు ఉందని మరింత అభివృద్ది చేస్తాని అన్నారు.అర్హలైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తానని ఎవరు మాటలు నమ్మద్దని ఒక్క పైస ఖర్చులేకుండా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఇస్తానని మంత్రి స్పష్టం చేశారు.జమ్మికుంట టూ కమాలాపూర్ వరకు 18 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టబోతున్నామని త్వరలో పనులు ప్రారంభమౌతాయని మంత్రి పేర్కోన్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వికలాంగులకు 15వందల రూపాయలు వృద్దులకు,వితంతులకు బిడీ కార్మీకులకు 1000రూపాయలు ఫించన్లు ఇస్తున్నామని అక్కడో ఇక్కడో తప్పిపోతే తన దృష్టికి తీసుకవస్తే ఇప్పిస్తానని మంత్రి తెలిపారు.పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అందుకే గురుకుల పాఠశాలలు,మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కోక్క విద్యార్థిపై లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.వైద్యం కోసం వెళ్ళి అప్పుల పాలు కావద్దనే లక్షంతో ప్రభుత్వ అసుపత్రిల్లో మంచి వైద్యం అందిస్తున్నామని తెలిపారు.దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఎకరానికి రెండు పంటలకు 8వేలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆ ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని అన్నారు.రైతు బందు ఫథకం రాష్ట్రనికి గొప్ప పేరు వచ్చిందని తెలిపారు.అన్ని వర్గాల ప్రజలను అదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని అన్నారు.కొందరు అది చేస్తాము ఇది చేస్తామని దొంగ మాటలు చేపుతూ వస్తారని వారి మాటలు నమ్మద్దన్నారు.దొంగలకు సద్ది కట్టే ప్రయత్నం చేయద్దని ఎవరు మాటలు చేపుతారు ఎవరు పనులు చేస్తారో మీకు ఇప్పటికే అర్దమైందన్నారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీఓ చెన్నయ్య తహశీల్దార్ బావుసింగ్ ఎంపిడిఓ రమేష్ ఎంపిపి గంగారపు లతశ్యాం సహకార సంఘాల యూనియన్ అద్యక్షులు తక్కళ్ళపెల్లి రాజేశ్వర్‌రావు మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి ఇల్లందకుంట అలయ చైర్మన్ ఎక్కటి సంజీవరెడ్డి కౌన్సిలర్లు శ్రీలం శ్రీనివాస్ దయ్యాల శ్రీనివాస్ చంద రాజు సర్పంచ్‌ల ఫోరం అద్యక్షులు యుగేందర్‌రెడ్డి సర్పంచ్‌లు కోమాల్‌రెడ్డి నేరేళ్ళ లక్ష్మి టిఆర్‌ఎస్ అర్బన్ అద్యక్షులు పొనగంటి మల్లయ్య నాయకులు అప్పల రవీందర్ దేశిని కోటి గౌస్ కోమ్ము అశోక్ మహ్మద్ రుస్తుం జానీ వెంకన్న ఖదీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.