పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం వరం

Kalyan Lakshmi Scheme for Pandithi Females

మనతెలంగాణ/మేడిపల్లి: తెలంగాణ రాష్ట్రం లో పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ పథకంఒక వరం లాంటిదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్ధార్ కా ర్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మండలానికి చెందిన కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్,లబ్ధిదారులు 102 మం ది లబ్ధిదారులకు రూ.75లక్షల చెక్కులను అం దజేశారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీపథకం ద్వారా పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ ర్థిక భరోసాను అందిస్తున్నారని, రాష్ట్రంలో అ నేక సంక్షేమ పథకాలు ప్రారంభించి దేశంలో ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారన్నారు.
అనంతరం ఈదుల లింగంపేటలో వేలుమా ల మహేందర్‌రెడ్డి-నవ్యరెడ్డిల వివాహానికి హాజ రైనూతన వధూవరునుల ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ లోకబాపురె డ్డి, తహసీల్ధార్ సుజాత, జెడ్పీటీసీ పూర్ణిమాప్రభాకర్, ఎంపిపి అన్నపూర్ణరవీందర్, టిఆర్‌ఎస్ అధ్యక్షుడు గంగాధర్‌గౌడ్, నాయకులు భూమే ష్‌గౌడ్,శంకర్,దాసు తదితరులు పాల్గొన్నారు.