పేదరికం చేసింది గత పాలకులే

మన తెలంగాణ/బిజినేపల్లి: గతంలోనే నాగర్‌కర్నూల్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిన ఉన్నత స్థానంలో ఉండేదని, నాగర్‌కర్నూల్ పేద జిల్లా కాదని గత పాలకుల నిర్లక్షం వల్లే  జిల్లాను పేద జిల్లాగా తయారు చేశారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధనరెడ్డి ఆరోపించారు. మంగళవారం పల్లెప్రగతి ప్రస్థానంలో భాగంగా మండలంలోని వెలుగొండ, మంగనూరు,గౌరారం, లట్టుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వెలుగొండ గ్రామంలో వాటర్‌ట్యాంక్, సీసీరోడ్డు, మంగనూరులో వెటర్నరీ ఆసుపత్రి, పాఠశాల అదనపు తరగతి గదులు, […]

మన తెలంగాణ/బిజినేపల్లి: గతంలోనే నాగర్‌కర్నూల్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిన ఉన్నత స్థానంలో ఉండేదని, నాగర్‌కర్నూల్ పేద జిల్లా కాదని గత పాలకుల నిర్లక్షం వల్లే  జిల్లాను పేద జిల్లాగా తయారు చేశారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధనరెడ్డి ఆరోపించారు. మంగళవారం పల్లెప్రగతి ప్రస్థానంలో భాగంగా మండలంలోని వెలుగొండ, మంగనూరు,గౌరారం, లట్టుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వెలుగొండ గ్రామంలో వాటర్‌ట్యాంక్, సీసీరోడ్డు, మంగనూరులో వెటర్నరీ ఆసుపత్రి, పాఠశాల అదనపు తరగతి గదులు, నూతన బస్టాండ్‌కు శంకుస్థాపన, డ్రైనేజీలకు శంకుస్థాపన, లట్టుపల్లిలో కటిన సంఘం కమ్యూనిటీ హాల్ భూమిపూజ, సీసీ రోడ్లు ప్రారంభోత్సవం, గౌరారంలో బిసి కమ్యూనిటీ హాల్ భూమి పూజల , సీసీరోడ్ల ను ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో కలిసి  ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ  గత పాలకుల నిర్లక్షం వల్ల తెలంగాణలో పెన్షన్ల కోసం ఎదురు చేసే దుస్థితికి ప్రజలు వచ్చారని, అలాంటి దుస్థితిని పారద్రోలి ప్రజలు ఆత్మవిశ్వాసంతో జీవించడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుని పని చేస్తోందన్నారు. రైతులకు మరింత న్యాయం చేకూర్చాలని రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.8 వేలు అందిస్తోందన్నారు. రైతు భీమా ద్వారా రైతు మృతి చెందితే రూ.5 లక్షల బీమా సౌకర్యం ప్రారంభించడం జరిగిందని, తెలంగాణలో ఏ దేశంలో లేని 275 సంక్షేమ పథకాలను  టిఆర్‌ఎస్ ప్రవేశపెట్టిందన్నారు. అభివృద్ధి చేసే నాయకున్నే ప్రజలు ఆశీర్వదిస్తారని, ప్రజలకు ఎవ్వరు ఎలాంటి వారో తెలుసన్నారు. మంచి చేసేవారికే ఎప్పుటికి గుర్తుంటారని తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, మండలాధ్యక్షులు కిరణ్, నాయకులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: