పేటీఎంలో వారెన్ బఫెట్ రూ.2500 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన వారెన్ బఫెట్‌కు చెందిన సంస్థ బెర్క్‌షైర్ హాత్‌వే సంస్థ భారత్‌లో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తోంది. దేశీయ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంలో దాదాపు రూ.2500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు ఈ డీల్‌తో దగ్గరి సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించా యి. ఈ విషయాన్ని బఫెట్ అసిస్టెంట్ దెబీ బొసనెక్ కూడా ఇ మెయిల్ ద్వారా ధ్రువీకరించినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. పేటీఎం మాతృక సంస్థ అయిన […]

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన వారెన్ బఫెట్‌కు చెందిన సంస్థ బెర్క్‌షైర్ హాత్‌వే సంస్థ భారత్‌లో భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తోంది. దేశీయ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంలో దాదాపు రూ.2500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు ఈ డీల్‌తో దగ్గరి సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించా యి. ఈ విషయాన్ని బఫెట్ అసిస్టెంట్ దెబీ బొసనెక్ కూడా ఇ మెయిల్ ద్వారా ధ్రువీకరించినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. పేటీఎం మాతృక సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌లో హాత్‌ఎవే 356 బిలియన్ డాలర్లు (రూ. 2500 కోట్ల) పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే పేటీఎంలో సాఫ్ట్ బ్యాంక్, అలీబాబా గ్రూప్, యాంట్ లాంటి ఫైనాన్షియల్ సంస్థలు భాగస్వాములుగా ఉ న్నాయి. తాజాగా వాటి సరసన బెర్క్‌షైర్ కూడా చేరగా, ప్రైవేటు టెక్నాలజీ సంస్థలో బఫెట్ సంస్థ పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. పేమెంట్స్ రంగంలోకి అడుగుపెడితే బాగుంటుందని ఈ ఏడాది మే నెలలో జరిగిన బెర్క్‌షైర్ వార్షిక వాటాదారుల సమావేశంలో బఫెట్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Comments

comments

Related Stories: