పెళ్లైన కాసేపటికే వధువు మృతి!

Bride dead in Nagarkurnool District

నాగర్‌కర్నూల్: వివాహం జరిగిన కొద్దిసేపటికే నవ వధువు మృతి చెందిన విషాద ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. పెళ్లి తంతూలో భాగంగా అరుంధతి నక్షత్రం చూపిస్తుండగా వధువు బుజ్జి(23) ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో వధువును బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది.