పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోలేదు

Cph4-katria-kaif-Pathగత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీక్వీన్ కత్రినాకైఫ్, హీరో రణబీర్ కపూర్‌ల మధ్య ప్రేమాయణం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరుగాంచిన వీరిద్దరు తరచుగా వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రణబీర్, కత్రినాలు త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఓ ఈవెంట్‌లో కత్రినాను ఈ విషయమై అడిగితే ఆమె సమాధానమిస్తూ… రణబీర్‌తో తన బంధం ఎంతో హ్యాపీగా కొనసాగుతోందని చెప్పింది. కానీ పెళ్లి విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేని స్పష్టంచేసింది. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఫాంటమ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కత్రినా కైఫ్ బిజీగా ఉంది. సైఫ్ అలీఖాన్, కత్రినా జంటగా ఈ సినిమా తెరకెక్కింది. ఈనెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక రణబీర్ కపూర్, దీపికాపదుకునే జంటగా రూపుదిద్దుకుం టున్న ‘తమాషా’ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ సందర్భంగా ఫిల్మ్‌మేకర్ సాజిద్ నడియాడ్‌వాలా సినిమా టీంకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో రణబీర్‌తో కలిసి కత్రినా కూడా హాజరవుతుందని ముందుగా తెలిసింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఈ పార్టీలో పాల్గొని ఎంజాయ్ చేయాలని కత్రినా కూడా నిర్ణయించుకుంది. కానీ చివరి నిమిషంలో తాను నటిస్తున్న ‘ఫితూర్’ షూటింగ్ బిజీ షెడ్యూల్ మూలంగా కత్రినా ఈ పార్టీని మిస్ అయి ఎంతో బాధపడిందట.

Comments

comments