పెళ్లి పేరుతో మోసం.. దర్శకుడిపై కేసు…

Police filed cheating, Sexual assault case against film director: Hyderabad

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేయడంతో పాటు మరో యువతిని పెళ్లాడిన వర్థమాన దర్శకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత సినీ ఆర్టిస్ట్‌ను ప్రేమ, పెళ్లి పేరుతో రెండేళ్ల పాటు సహజీవనం చేసి ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రాంతానికి చెందిన పి.లక్ష్మి(40) భర్తతో విడిపోయి ఒంటరిగానే ఉంటుంది. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శ్రీదత్త అనే వర్ధమాన దర్శకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. దీంతో సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ, పెండ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. అయితే, ఇటీవల 22గ్రాముల బంగారం, రూ.10వేల నగదును తీసుకొని మాయం అయ్యాడు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. కాగా, ఇటీవల శ్రీదత్త మరో యువతిని పెండ్లిచేసుకున్నట్లు లక్ష్మికి తెలిసింది. దాంతో బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై లైంగిక వేధింపులు, చీటింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Comments

comments