పెళ్లి పీటలెక్కనున్న దీపికా పదుకొనే..?

ముంబయి:  బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకునే ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనుంది. దీపికా ఈ ఏడాది నవంబరు 10న  తన బాయ్ ఫ్రెండ్ రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకోనుందనే  వార్తా బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.  అయితే దీపికా మాత్రం ఇప్పటి వరకు తన పెళ్లి విషయంపై స్పందించలేదు.  రణ్‌వీర్ సింగ్, దీపికాలు కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా వీరిద్దరి వివాహంపై పలు వార్తలు వస్తున్నాయి. ఇరువురి కుటుంబ పెద్దల నిర్ణయం మేరకు నవంబరు 10న ముహూర్తం […]

ముంబయి:  బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకునే ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనుంది. దీపికా ఈ ఏడాది నవంబరు 10న  తన బాయ్ ఫ్రెండ్ రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకోనుందనే  వార్తా బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.  అయితే దీపికా మాత్రం ఇప్పటి వరకు తన పెళ్లి విషయంపై స్పందించలేదు.  రణ్‌వీర్ సింగ్, దీపికాలు కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా వీరిద్దరి వివాహంపై పలు వార్తలు వస్తున్నాయి. ఇరువురి కుటుంబ పెద్దల నిర్ణయం మేరకు నవంబరు 10న ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరిపించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారని తెలిసింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని దీపికా  సన్నిహిత వర్గాలు తెలిపాయి.