పెళ్లింట విషాదం…

అచ్చంపేట: కోటి ఆశలతో పుట్టినింటి నుండి మెట్టినింటికి వెలదామని కలలు కన్న నవ వదువు పెళ్లి పందిరిలోనే తలంబ్రాలు పోసుకుంటూ వరుడి కాళ్లపై పడి అక్కడికక్కడే మృతి చెందిన హృదయ విదార కర ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బంధువులంతా తమకు ఉన్నంత స్థాయిలో వివాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని వివాహ గట్టం ప్రారంభించి తాలి కట్టిన పది నిమిషాలలోనే అందరు చూస్తుండగానే వధువు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందిన సంఘటన అచ్చంపేట పట్టణంలోని […]

అచ్చంపేట: కోటి ఆశలతో పుట్టినింటి నుండి మెట్టినింటికి వెలదామని కలలు కన్న నవ వదువు పెళ్లి పందిరిలోనే తలంబ్రాలు పోసుకుంటూ వరుడి కాళ్లపై పడి అక్కడికక్కడే మృతి చెందిన హృదయ విదార కర ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బంధువులంతా తమకు ఉన్నంత స్థాయిలో వివాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని వివాహ గట్టం ప్రారంభించి తాలి కట్టిన పది నిమిషాలలోనే అందరు చూస్తుండగానే వధువు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందిన సంఘటన అచ్చంపేట పట్టణంలోని మహింద్ర నగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం జరిగింది. మహింద్రగర్ కాలనీలోని నీరంజన్ , శంకరమ్మల కుమార్తే కొండి నీరంజనమ్మ(లక్ష్మి 20) ని వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన శేఖర్, పద్మల కుమారుడు వెంకటేష్ కు ఇచ్చి వివాహం చేసేందుకు శనివారం ముహుర్తాన్ని ఖరారు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వేద మంత్రోచ్చరణల మధ్య వివాహం జరిపించారు. తాళి కట్టిన అనంతరం వరుడు తలంబ్రాలు పోస్తుడగానే ఒక్క సారిగా నీరంజనమ్మ కుప్పకూలి వరుణి కాళ్ల వద్ద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తేరుకున్న బంధువులు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతికి గుండే పోటే కారణమాని పలువురు చర్చించుకున్నారు. పెళ్లి మండపంలోనే వధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోధనాలు మిన్నంటాయి. నీరంజనమ్మ కు ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెల్లు ఉండగా ఇద్దరు సోదరులు, తండ్రి గతంలోనే మరణించారు. వధువు మృత దేహానికి అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు శవాన్ని అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యులను అచ్చంపేట మున్సిపల్ ఛైర్మెన్ తులసి రాం, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహ్మ గౌడ్, టిఆర్‌ఎస్ నేతలు కోట కిషోర్, హుస్సేన్ తదితరులు పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అచ్చంపేట ఎస్‌ఐ పర్శరామ్ తెలిపారు.

Related Stories: