పెరిగిన బంగారం ధర

Gold Price Increase in Bullion Market

ముంబయి : గురువారం బంగారం ధర  పెరిగింది. ఈ రోజు బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 పెరిగి రూ.31,200కు చేరింది. ఈరోజు మార్కెట్లో వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా రూ.38,300గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.48శాతం పెరిగి 1206.30 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.24 శాతం పెరిగి 14.73 డాలర్లుగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.82గా ఉంది.

Gold Price Increase in Bullion Market

Comments

comments