పెద్దవారితో పాటు పిల్లలు కూడా…

Silly-Fellowఅల్లరి నరేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినిరాయ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీఫెలోస్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,  బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో ఏర్పాటైన సినిమా సక్సెస్‌మీట్‌లో అల్లరి నరేశ్ మాట్లాడుతూ “కితకితలు, బెండు అప్పారావు సినిమాలను ఎంత ఎంజాయ్ చేసినా పిల్లలను కూడా నవ్వించాలనేదే నా టార్గెట్. ‘సిల్లీఫెలోస్’ చిత్రాన్ని పెద్దవారితో పాటు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మంచి సక్సెస్‌తో హ్యాపీగా ఉన్నాను”అని అన్నారు. సునీల్ మాట్లాడుతూ “భీమనేని ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు.  డైలాగ్స్ చెప్పేటప్పుడు అల్లరి నరేశ్ నాకు హెల్ప్ చేశారు. సినిమాలో హీరోయిన్లు చాలా బాగా నటించారు”అని తెలిపారు. భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ “ఈ సినిమా రూపకల్పనకు ముఖ్య కారణం వివేక్. ఆయన నా మిత్రుడు కావడం సంతోషంగా ఉంది. అల్లరి నరేశ్, సునీల్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమా విజయం సాధించడంతో ఆనందంగా ఉంది”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్రా శుక్లా, కిరణ్ రెడ్డి, అనిల్ సుంకర, పోకూరి బాబురావు, గోపి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments