పెద్దబజార్‌కు పూర్వవైభవం

 Synthetic track structures with 5.5 crores

 అభివృద్ధికి సహకరించిన అందరికీ అభినందనలు
 రూ.4.3 కోట్లతో రోడ్డు, రూ.5.5కోట్లతో సింథటిక్ ట్రాక్ నిర్మాణాలకు
శంకుస్థాపన
రూ.70 లక్షలతో
క్రీడాకారులకు మౌలిక
సదుపాయాల కల్పన
 భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
 సగం కంటే ఎక్కువ కోల్పోయిన రోడ్డు విస్తరణ బాధితులకు డబుల్ బెడ్‌రూంలు
 ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి

మన తెలంగాణ/మెదక్ టౌన్
పట్టణంలో ప్రధాన వ్యాపారం కొనసాగిన పెద్దబజార్‌కు పునర్ వైభవం సంతరించుకోనుందని, ఒకప్పుడు ఇరుకిరుగా ఉండి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న స్థానికులు రోడ్డు వెడల్పుతో తమ వ్యాపారాన్ని మళ్లీ అభివృద్ధి పర్చుకోవడానికి ఎంతో అవకాశముందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మె ల్యే, శాసన సభ ఉప సభాపతి పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రూ.5.5 కోట్లతో సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులకు, రూ.4.3కోట్ల వ్యయంతో చేపడుతున్న పెద్దబజార్ బీటీ రోడ్డు, మురికికాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం నుండి తరలివెళ్తున్న స్టేడియాన్ని నిలుపుదల చేసి క్రీడాకారులకు రూ.70 లక్షలతో హాస్టల్ వసతితో పాటు అన్ని మౌళిక సదుపాయాలను అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టి ఇక్కడే సెలక్షన్లు జరిగేలా ప్రత్యేక కోచ్‌ను కూడా రప్పిస్తామని తెలిపారు. సింతటిక్ ట్రాక్ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుకొని రెండున్నర నెలల సమయంలో పూర్తి నాణ్యతాయుతంగా ట్రాక్ నిర్మించాలని, భవిష్యత్తులో క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సిద్దిపేటలో గతంలో ఇరుకుగా రోడ్లు ఉండేవని, వాటిని వెడల్పు చేసే క్రమంలో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రోడ్ల నిర్మాణం అనంతరం ఎంతో అభివృద్ధి చెంది వ్యాపారం వృద్ధి కావడంతో ఆనందం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. అదే తరహాలో పట్టణంలో రోడ్ల విస్తరణ సమయంలో స్థానికులకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ తరువాత మంచి వ్యాపారం కొనసాగి ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. పెద్దబజార్ రోడ్డు విస్తరణలో ఎంతో మంది దుకాణాలు, ఇళ్ళు కోల్పోయారని, అయినప్పటికీ వారు స్వచ్ఛందంగా అభివృద్ధి కోసం ముందుక వచ్చి త్యాగం చేశారని, వారిని ప్రభుత్వం తరపున తప్పకుండా సహకరిస్తామని హామినిచ్చారు. సగం కంటే ఎక్కువ ఇళ్లు, దుకాణాలు కొల్పోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూంలలో అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. ము ఖ్యంగా పెద్దబజార్ రోడ్డు విస్తరణలో స్వర్ణకారుల సహకారం అభివృద్ధికి ఎంతో తోడ్పడిందని ప్రత్యేకంగా అభినందిచారు. మున్సిపల్ ఇంజనీర్లకు, సంబంధిత అధికారులకు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని పెద్దబజార్ వ్యాపారులకు ఇబ్బందులు కలుగజేయోద్దని మంత్రి ఆదేశించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దబజార్ రోడ్డు విస్తరణలో ముఖ్యంగా స్వర్ణకారులతో పాటు ఇతర వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఇళ్లను, దుకాణాలను త్యాగం చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సగం కంటే ఎక్కువ కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. అనంతరం స్థానిక క్రిస్టల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మగ్గం చీరల ఎగ్జిబీషన్, జూట్ బ్యా గుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ మల్లికార్జున్‌గౌడ్, ఎమ్మెల్సీ పాతురి సుధాకర్‌రెడ్డి, జెసి నగేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకిరెడ్డి కిష్టారెడ్డి, వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు చంద్రకళ, ఆర్కె శ్రీను, వెంకటరమణ, కోఆప్షన్ సభ్యులు గంగాధర్, సాధిక్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అధికారులు పాల్గొన్నారు.