పెంపుడు జంతువులతో జాగ్రత్త

మన చుట్టూ నిత్యం మెదిలే పెంపుడు జంతువులే మన ఆరోగ్యం పాలిట శుత్రువులు అవుతాయంటే నమ్మగలరా? అవును నమ్మక తప్పదు. పాడిపరిశ్రమ, గొర్రెల,మేకల పెంపకందారులు, ఇతర పెంపుడు జంతువులు, పక్షులు, కోళ్ల పరిశ్రమలతో ప్రత్యక్షంగాను లేక పరోక్షంగాను సంబంధం ఉన్నవారు పోషణ, యాజమాన్య పద్ధతులలో భాగంగా జంతువులను, కోళ్లను తాకాల్సి వస్తుంది. ఈ సమయంలో మనుషుల నుంచి జంతువులకు లేదా జంతువుల నుంచి మనుషులకు ఈ జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తాయి. సహజసిద్ధంగా మనుషులు, జంతువుల మధ్య సంక్రమించే […]

మన చుట్టూ నిత్యం మెదిలే పెంపుడు జంతువులే మన ఆరోగ్యం పాలిట శుత్రువులు అవుతాయంటే నమ్మగలరా? అవును నమ్మక తప్పదు. పాడిపరిశ్రమ, గొర్రెల,మేకల పెంపకందారులు, ఇతర పెంపుడు జంతువులు, పక్షులు, కోళ్ల పరిశ్రమలతో ప్రత్యక్షంగాను లేక పరోక్షంగాను సంబంధం ఉన్నవారు పోషణ, యాజమాన్య పద్ధతులలో భాగంగా జంతువులను, కోళ్లను తాకాల్సి వస్తుంది. ఈ సమయంలో మనుషుల నుంచి జంతువులకు లేదా జంతువుల నుంచి మనుషులకు ఈ జూనోటిక్ వ్యాధులు సంక్రమిస్తాయి. సహజసిద్ధంగా మనుషులు, జంతువుల మధ్య సంక్రమించే వ్యాధులనే జూనోటిక్ వ్యాధులని అంటారు.
జూనోటిక్ వ్యాధుల రకాలు:
ఈ జూనోటిక్ వ్యాధులలో ముఖ్యంగా పిచ్చికుక్క వ్యాధి (రె బిస్), మెదడువాపు వ్యాధి, బర్డ్‌ప్లూ, మశూచి, పశువులలో ఈసుడు రోగం, దొమ్మ రోగం, ధనుర్వాతం, క్షయవ్యాధి, టాక్జోప్లాస్మోసిస్, బ్రూసెల్లోసిస్, నల్లజ్వరం, ఆంత్రాక్స్, బ్లూసెల్లోసిస్, ధనుర్వాతం, సాల్మానెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, అమీబియాసిస్, జియార్డియాసిస్, ఎఖైనోకోకోసిస్, టీనియాసిస్, సిస్టోసోమియాసిస్, క్యాండిడియోసిస్ వంటి పలు రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల వ్యాధులలో దాదాపు 80 శాతం జూనోటిక్ వ్యాధులే. వీటిలో చాలా వరకు అటు మనుషులకు, ఇటు జంతువులకు ప్రాణంతకమైనవిగానే ఉన్నాయి.

Comments

comments