పూర్తి నిజంలా బయోపిక్

ఇటీవల వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ రికార్డు కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ హి ట్‌గా నిలిచింది. ఇందులో సంజయ్ లైఫ్ ను పాజిటివ్ యాంగిల్‌లోనే చూపించారు. చాలా వరకు బయోపిక్స్ అలాగే ఉంటా యి. చాలా అరుదుగా మాత్రమే బయోపిక్‌లో నెగటివ్ యాంగిల్ కనిపిస్తుంటుంది. మరి శృంగార తార షకీలా బయోపిక్ ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్న అందరికీ ఎదురవుతుంది. ఈ బయోపిక్ పూర్తి నిజంలా ఉంటుందని షకీలా అంటోంది. తన జీవితం మొత్తం ఈ సినిమాలో ఆవిష్కృతమైందని […]

ఇటీవల వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ రికార్డు కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ హి ట్‌గా నిలిచింది. ఇందులో సంజయ్ లైఫ్ ను పాజిటివ్ యాంగిల్‌లోనే చూపించారు. చాలా వరకు బయోపిక్స్ అలాగే ఉంటా యి. చాలా అరుదుగా మాత్రమే బయోపిక్‌లో నెగటివ్ యాంగిల్ కనిపిస్తుంటుంది. మరి శృంగార తార షకీలా బయోపిక్ ఎలా ఉండబోతోంది? అనే ప్రశ్న అందరికీ ఎదురవుతుంది. ఈ బయోపిక్ పూర్తి నిజంలా ఉంటుందని షకీలా అంటోంది. తన జీవితం మొత్తం ఈ సినిమాలో ఆవిష్కృతమైందని ఆమె పేర్కొంది. “నా బయోపిక్‌లో మంచి, చెడు ఉంటాయి. ఏదైనా అంశాన్ని దాచేస్తే అసలు బయోపిక్ అన్న మాటకే అర్థం లేదు”అని షకీలా పేర్కొంది. “షకీలాలో ఈ సిన్సియారిటీ నాకు నచ్చింది. అందుకే ఈ బయోపిక్ చేయాలనుకుంటున్నా”అని బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా చెప్పింది. ఈ సినిమాలో బోల్డ్‌గా కనిపించాల్సి వస్తే తనకేమీ అభ్యంతరం లేదని రిచా పేర్కొంది.

Comments

comments

Related Stories: