పూర్తయిన కరుణానిధి అంత్యక్రియలు…

karunanidhi laid to rest at marina beach next to anna memorial

చెన్నై: తమిళనాడు మాజీ సిఎం, డిఎంకె అధినేత కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. మెరీనా బీచ్ లోని అన్నా స్వ్కేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంతిమ సంస్కారాలు జరిపారు. బంగారుపూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థివ దేహాన్ని ఖననం చేశారు. కరుణానిధికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీకి చెందిన నేత గులాం నబీ ఆజాద్, టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ ప్రధాని దేవెగౌడ పాటు కరుణానిధి కుటుంబసభ్యులు, సన్నిహితులు తదితరులు నివాళులర్పించారు. కరుణానిధికి చివరి సారిగా వీడ్కోలు పలికేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.