పురుగుల మందు తాగి రైతు బలవన్మరణం

కొడంగల్‌ః పంటలు పండక అప్పులు తీరక దిక్కుతోచని స్ధితిలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని హస్నాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని భీమేశ(40) తనకున్న నాలుగు ఎకరాల పొలంతో పాటు 10ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు. సొంత పొలంలో రెండు బోర్లు వేసిన నీరు రాలేదు. ఇటు కౌలుకు చేసిన లాభ సాటిగా లేకపోగ అప్పులు మాత్రం మిగిలాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భీమేశ […]

కొడంగల్‌ః పంటలు పండక అప్పులు తీరక దిక్కుతోచని స్ధితిలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంగళవారం మండల పరిధిలోని హస్నాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని భీమేశ(40) తనకున్న నాలుగు ఎకరాల పొలంతో పాటు 10ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు. సొంత పొలంలో రెండు బోర్లు వేసిన నీరు రాలేదు. ఇటు కౌలుకు చేసిన లాభ సాటిగా లేకపోగ అప్పులు మాత్రం మిగిలాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భీమేశ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించాడు. అపస్మారక స్థితిలో ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు స్ధానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి ఇద్దరు కూతుర్లు,కుమారుడు ఉన్నారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Stories: