పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

Farmer Commite Sucide In Mancherial District
బెజ్జూర్‌ః బెజజూర్ మండలంలోని పోతపల్లి గ్రామానికి చెందిన గౌరి పోచయ్య (45) అనే రైతు పురుగుల మందు సేవించి ఆత్మహత్య కు పాల్పడినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. పోచయ్య అనే రైతు 7 ఎకరాల భూమిలో పత్తి , వరి తదితర పంటలను సాగు చేస్తున్నాడు. పంటకు పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేకపోవడంతో అప్పు చేసినప్పటికి డబ్బులు సరిపోకపోవడంతో మనస్థాపానికి గురై అప్పుల బాధతో శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.