పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

కడ్తాల్: మండల పరిధిలోని న్యామంతాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సుందరయ్య తెల్పిన వివరాల ప్రకారం… న్యామంతాపూర్ గ్రామానికి చెందిన వల్లెపు తిమ్మయ్య(65) వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. తిమ్మయ్య గత కొంత కాలంగా ఉపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం […]

కడ్తాల్: మండల పరిధిలోని న్యామంతాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సుందరయ్య తెల్పిన వివరాల ప్రకారం… న్యామంతాపూర్ గ్రామానికి చెందిన వల్లెపు తిమ్మయ్య(65) వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. తిమ్మయ్య గత కొంత కాలంగా ఉపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు తిమ్మయ్య భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

comments

Related Stories: